ప్రతిపక్ష పార్టీల క్యాడర్ మంత్రి లక్ష్మణ్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక !

J.SURENDER KUMAR,

ధర్మపురి నియోజకవర్గ ఉమ్మడి వెలగటూర్ , ధర్మారం మండలంలోని బీఆర్ఎస్, బిజెపి పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఎండపెల్లి మండలం రాజారాం పల్లె వద్ద గల SR గార్డెన్ లో బుధవారం జరిగిన పార్టీ చేరికల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు.

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రజా పాలన తీరును, పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు, రైతుల రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 42 శాతం బీసీ రిజర్వేషన్ తదితర కార్యక్రమాలకు ఆకర్షితులై చేరిన నాయకులు, కార్యకర్తలు , మాజీ సర్పంచ్ లు, మాజీ ప్రజాప్రతినిధులకు మంత్రి లక్ష్మణ్ కుమార్ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.