రహదారి సమస్యను పరిష్కరించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J SURENDER KUMAR,

ధర్మపురి నియోజకవర్గ పెగడపల్లి మండలం
ల్యాగలమర్రి గ్రామంలో స్మశానవాటిక రహదారి సమస్యకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శాశ్వత పరిష్కారం చేశారు.

ల్యాగలమర్రి గ్రామంలో  ఎస్సీ కాలనీ వాసులు గ్రామ శివారులో ఉన్న స్మశాన వాటికకు వెళ్లేందుకు రహదారి  లేకపోవడంతో మృతదేహాల, అంత్యక్రియల సందర్భంలో అనేక ఇబ్బందులు పడేవారు. రహదారి సమస్య అంశం  కాలనీవాసులు  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు మొరపెట్టుకున్నారు.


స్పందించి మంత్రి  భూయజమాని హనుమండ్ల రాఘవ రెడ్డి తో స్వయంగా మాట్లాడారు స్మశానవాటికకు వెళ్లే రహదారికి అవసరమైన భూమిని ఇచ్చే విధంగా భూమి యజమాని అంగీకరించడంతో ఆదివారం సమస్య పరిష్కారం అయ్యింది.

స్మశాన వాటిక వరకు సిమెంట్ రోడ్డు నిర్మించడంతో పాటు, నీటి అవసరాల కోసం బోరు ఏర్పాటును కూడా చేపడతామని మంత్రి కాలనీవాసులకు హామీ ఇవ్వడంతో వారు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు