ఆర్ఎంపి పిఎంపీల భవనం ప్రారంభించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J. SURENDER KUMAR,

గొల్లపల్లి మండల కేంద్రంలో ఆర్.ఎం.పి & పిఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ భవనాన్ని గురువారం ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.


అసంపూర్తిగా నిలిచిపోయిన భవనం  పూర్తి చేయాలని కోరుతూ కొద్ది రోజుల క్రితం మంత్రి లక్ష్మణ్ కుమార్ ను ఆర్.ఎం.పి పి.ఎం.పి వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కలిసి విజ్ఞప్తి చేశారు.

మంత్రి స్పందించి CRR, SDF నిధుల ద్వారా నాలుగు లక్షల రూపాయలను మంజూరు చేయించి భవన నిర్మాణాన్ని పూర్తి  చేయించారు.


ఈ సందర్భంగా మంత్రిని ఆర్.ఎం.పి & పిఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్లు   ఘనంగా సన్మానించి కృతఙ్ఞతలు తెలిపారు.