👉 ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి !
👉 జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ !
J SURENDER KUMAR,
జగిత్యాల రూరల్ మండల కల్లెడ గ్రామం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు. ఆసుపత్రిలో వైద్య సేవలను గురించి నేరుగా పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. రోజుకు ఎన్ని ఓ.పి.లను చూస్తున్నారు ? అని అడిగారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోని చుట్టుపక్కల ఖాళీ ప్లేస్ ఆవరణంలో పిచ్చి మొక్కలు ముళ్ల చెట్లు తొలగించి వెంటనే శానిటేషన్ చేపించాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ …
వర్షాకాలం సీజనల్ వ్యాధులు పై అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డెంగ్యూ, మలేరియా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన మెడిసిన్ అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు.

ఆరోగ్య కేంద్రం ఆవరణంలో పేషంట్ల గదులలో శుభ్రంగా ఉండేలా చూడాలని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఓ.పి సేవలు, రికార్డ్స్ ల్యాబ్ రికార్డ్స్, మెడికల్ ఫార్మసి రిజిస్టర్ పరిశీలించి డాక్టర్లు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని ఆదేశించారు. ఆసుపత్రిలో వైద్య సేవలను గురించి నేరుగా పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు.
కలెక్టర్ వెంట జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్, డి ఎం హెచ్ ఓ డాక్టర్ ప్రమోద్ కుమార్, కల్లెడ పిహెచ్ సెంటర్ డాక్టర్ సౌజన్య మరియు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
👉 తాహసిల్దార్ కార్యాలయం తనిఖీ !

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం తహసిల్దార్ కార్యాలయం ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.
ఈ సందర్బంగా కలెక్టర్ తెలంగాణ ప్రభుత్వం గత నెల కిందట నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన భూ సమస్యలపై ప్రతి దరఖాస్తు ను క్షుణ్ణంగా పరిశీలించి వచ్చే ఆగస్టు నెల 14 వరకు పూర్తి చేయాలని అధికారుల ను కలెక్టర్ ఆదేశించారు.
అదే విధంగా మీ సేవా సర్టిఫికెట్లను పెండింగ్ లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సర్టిఫికెట్లను ప్రజలకు అందించవలసిందిగా అధికారులను ఆదేశించారు.కలెక్టర్ వెంట గొల్లపల్లి మండల తహసిల్దార్ పరంధన్ , మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.