రైతులకు విత్తనాలు ఎరువులు సహకార సంఘాలలో అందుబాటులో ఉంచాలి !

👉 శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పని చేయాలి !

👉 ఉమ్మడి నల్గొండ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తాను !

👉 ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఇంచార్జి మంత్రిగా రావడం చాలా సంతోషంగా ఉంది !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

వర్షాకాలం మొదలైన సందర్భంగా రైతులకు కావలసిన విత్తనాలు ఎరువులు అన్ని సహకార సంఘాల ద్వారా ఇతర దుకాణల ద్వారా రైతులందరికీ అందుబాటులో ఉంచాలని, కల్తి విత్తనాలు, ఎరువులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, రైతులకు అధికారులు అందుబాటులో ఉండాలని ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచించారు.

ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జి మంత్రిగా బుధవారం  జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నల్గొండ,సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు పైన నిర్వహించిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల,నీటి పారుదల శాఖ మంత్రిఉత్తం కుమార్ రెడ్డి , రాష్ట్ర రోడ్డు భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి తో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  పాల్గొని వివిధ శాఖల అధికారులను జిల్లాకు సంబంధించి వివిధ అంశాలపై వివరాలు అడిగి తెలుసుకొని తగు సూచనలు చేశారు.

సమావేశానికి ముందుగా  ఇంచార్జి మంత్రిగా మొదటి సారిగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు విచ్చేసిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం  నార్కట్పల్లి వద్ద కార్యకర్తలు నాయకులతో కలిసి ఘనంగా  స్వాగతం పలికారు.

👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  మాట్లాడుతూ ….

సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున దానికి తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అందుబాటులో ఉండవలసిన మందులు అందుబాటులో ఉంచుకోవాలని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల విషయంలో పురోగతినీ, ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపు విషయంలో గాని లబ్ధిదారుల నిర్మాణం విషయంలో గాని ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షించాలని మంత్రి లక్ష్మణ్ కుమార్  అన్నారు.

👉 గత ప్రభుత్వం ధరణి తెచ్చి రైతులను ఏ విధంగా ఇబ్బందులు పెట్టిందో మనందరికీ తెలుసునని, దానికి అనుగుణంగా ధరణి స్థానంలో భూభారతి తీసుకొచ్చి ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి దరఖాస్తుల స్వీకరించడం జరిగిందని,  భూభారతి  సదస్సుల ద్వారా వచ్చిన దరఖాస్తులను  త్వరితగతిన పరిష్కరించి రైతులతో సమన్వయపర్చి వారికి ఎలాంటి సమస్య లేకుండా చూడాలని, అన్నారు.

👉 వర్షాకాలం మొదలైన సందర్భంగా విద్యుత్ షాక్ తగలకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని, మనుషుల గాని, మూగ జీవులు విద్యుత్ షాక్ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, రైతులకు కూడా విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, మంత్రి అన్నారు.

👉 పెండింగ్ లో ఉన్న అన్ని ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలని దానికి కావలసిన నిధులు విడుదల విషయంలో ప్రభుత్వ సహకారం ఉంటుందని, అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పని చేయాలని సూచించారు.