👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J SURENDER KUMAR,
తనకు కేటాయించిన శాఖల సంబంధిత అధికారులతో అన్ని అంశాలపై సమగ్ర సమాచారం తీసుకుంటున్నాను, సంక్షేమ, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తాను అని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ దివ్యాంగులు సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
👉 హైదరాబాద్ సచివాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడారు.
ఏప్రిల్ 2025 వరకు రెసిడెన్షియల్ హాస్టల్స్ పెండింగ్ బిల్లలను క్లియర్ చేయడం జరిగిందని, విద్యార్థులకు యూనిఫామ్స్, బుక్స్, షూస్ లకు సంబంధించిన టెండర్లు త్వరలోనే ప్రకటిస్తామని మంత్రి అన్నారు.

👉 గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న పాలకులు చేసినట్లుగా మేము చేయడం లేదనీ, డైట్, రెంటల్ తో సహా అన్ని బకాయిలను క్లియర్ చేశామన్నారు.
👉 ప్రైవేటు,కార్పొరేట్ స్కూళ్లలో 25% సీట్లు SC,ST విద్యార్థులకు సీట్లు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రతీ నెల హాస్టల్ భవనాల అద్దె చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆర్ధిక మంత్రికి విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు.
👉 దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతీ నియోజకవర్గంలో 2- 3 సంవత్సరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభిస్తామని, డైట్, కాస్మోటిక్ చార్జెస్ పెంచి వాటిని చెల్లించడం జరిగిందన్నారు.

👉 రాబోయే రోజుల్లో విద్యార్థులకు యూనిఫామ్స్ విషయంలో ఆలస్యం జరగకుండా చూస్తామని, గురుకులాల్లో ఆత్మహత్యలు జరగడానికి అనేక కారణాలున్నాయని, సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించే విధానంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.