సంక్షేమమే ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యం మంత్రి లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


ప్రజల సంక్షేమమే ప్రజా పాలన ప్రభుత్వాలు లక్ష్యమని, గత  ప్రభుత్వ కొంచెం సంవత్సరాల పాలనలో ఇవ్వని రేషన్ కార్డులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయంగా మంజూరు చేస్తోంది. రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తూ పేదలకు భరోసా కల్పిస్తున్నాం. అలాగే మహిళల ప్రయాణాన్ని సురక్షితంగా, ఆర్థికంగా మద్దతివ్వడానికే ఉచిత బస్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాం, అని ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

పెగడపల్లి మండల  ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ముఖ్యమంత్రి సహాయక నిధి కింద ₹11 లక్షల 9వేల రూపాయల విలువ గల 41 చెక్కుల పంపిణీ చేశారు లబ్ధిదారులకు మంత్రి అందజేశారు.

రైతుల కోసం రైతు బంధు అమలు చేసిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. సాగుపై పెట్టుబడులు పెరగడానికి ఇది ఎంతో ఉపయోగపడుతోందన్నారు. కౌలు రైతులకు కూడా మద్దతుగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. అలాగే రైతులపై ఉన్న పాత రుణాలను మాఫీ చేస్తూ రైతుల పై భారం తగ్గించామని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.