శ్రీ లక్ష్మీనరసింహుని నీడను వీడని మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాజకీయ పదోన్నతులు శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొలువైన క్షేత్రాల నీడలోనే కొనసాగుతున్నది. రాజకీయ పరంగా, దైవికంగా, కాకతాళీయంగానో అంతు చిక్కకపోయినా మంత్రి లక్ష్మణ్ కుమార్ కు రాజకీయ అత్యున్నత పదవులు మాత్రం  లక్ష్మీనరసింహస్వామి నీడలోనే కొనసాగుతున్నాయనే చర్చ మొదలైంది.


👉 వివరాల్లోకి వెళితే..

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొలువైన ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ ( పునర్విభజనలో ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆవిర్భవించిన ) నుంచి 2009 లో మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓటమి చెందారు. 2014, 2018, లోను  వరుసగా ఓడిపోయారు. ఇదే నియోజకవర్గంలో నుంచి 2023 ఎన్నికల్లో భారీ ఓట్ల మెజార్టీతో గెలిచారు.


గత 15 సంవత్సరాలుగా ధర్మపురి సెగ్మెంట్లో కాన్టెస్టెడ్ ఎమ్మెల్యేగా పర్యటించిన  పలుసార్లు స్థానిక శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడం. పలు సందర్భాలలో ఆ స్వామి అనుగ్రహం ఉంటే ఎమ్మెల్యేగా గెలుస్తాను, అంటూ లక్ష్మి నరసింహ స్వామి పై అపార భక్తి, నమ్మకం, విశ్వాసం వ్యక్తం చేసేవారు.


ఎమ్మెల్యేగా విజయం సాధించిన మంత్రి లక్ష్మణ్ కుమార్, తన మొదటి ఎమ్మెల్యే నెల జీతం లోక కళ్యాణార్థం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జనవరి 2024 లో  వారం రోజుల పాటు జరిగిన ‘శ్రీ ప్రేమిక వరద వేద పరిపాలన సభ’ లో
వేద పారాయణ వేద పండితులకు, వారి శిష్య బృందంకు వారం రోజులపాటు భోజన, ఫలహారాలు, మహా పూర్ణాహుతి సందర్భంగా పండితులకు, ఆర్థిక చేయూతనిచ్చారు.


ప్రభుత్వ విప్ గా పదోన్నతి పొందిన మంత్రి లక్ష్మణ్ కుమార్ , బ్రహ్మోత్సవాలలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం తిలకించడానికి గతంలో భక్తుల ఇబ్బందులను గుర్తించి, గోదావరి నది తీరాన గల శ్రీ మఠం మైదానంలో లక్షలాది రూపాయల వ్యయంతో  ప్రభుత్వ పక్షాన అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం నిర్వహించి భక్తుల ప్రశంసలు పొందారు.

అనేక సంవత్సరాలుగా జీతాలు పెరగక ఇబ్బందులు పడుతున్న ఆలయ అర్చకుల, వేద పండితుల, కాంట్రాక్ట్ ,ఔట్సోర్సింగ్, ఇతర ఉద్యోగులు జీతాలను గణనీయంగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయించారు.


జూన్ 8న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి స్వామి వారి దర్శనానికి వచ్చిన లక్ష్మణ్ కుమార్, ఇకనుండి నేను స్వామి దర్శనంకు వచ్చిన ప్రతిసారి నాకు పూర్ణకుంభ, మంగళ వాయిద్యాలతో స్వాగతాలు, పూలదండలు, శాలువాలు కప్పడం వద్దు. నేను స్వామివారి సన్నిధిలో సామాన్య భక్తుడిని మాత్రమే అంటూ ఆలయ అధికారులను ఆదేశించారు.


దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొలువైన ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ మంత్రిగా లక్ష్మణ్ కుమార్ నియామకం తెలిసిందే.


యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని ముందుగా దర్శించుకొని బుధవారం నల్గొండ జిల్లా సమీక్ష సమావేశం లో మంత్రి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. రాజకీయ పదోన్నతులు మంత్రి లక్ష్మణ్ కుమార్ కు  శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొలువైన జిల్లాలలోనే  రావడం ప్రస్తాహనారం.