స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా కృషిచేసి అన్ని స్థానాలలో జండా ఎగరాలి అని ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి, వరంగల్ జిల్లా ఇంచార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధ్యక్షతన  వరంగల్ జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులతో ఆదివారం హైదరాబాద్ గాంధీభవన్ లో సమావేశం  జరిగింది. ఈ  సమావేశంలో సంస్థాగత పార్టీ నిర్మాణం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చించారు. మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.