తెలంగాణలో అంత‌ర్జాతీయ ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు అవ‌కాశం ఇవ్వండి !

👉 సీఎం రేవంత్ రెడ్డికి ప్రముఖ అజయ్ దేవగన్ విజ్ఞప్తి !

J.SURENDER KUMAR,

తెలంగాణలో అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాలతో కూడిన ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు అవ‌కాశం క‌ల్పించాల‌ని ముఖ్య‌మంత్రి  రేవంత్ రెడ్డి ని ప్ర‌ముఖ సినీ న‌టుడు అజయ్ దేవగణ్  విజ్ఞ‌ప్తి చేశారు.


👉 ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్య‌మంత్రి ని అజయ్ దేవగణ్  కలిసి ఈ అంశంపై చర్చించారు. తెలంగాణలో సినీ నిర్మాణంలో కీల‌క‌మైన యానిమేష‌న్‌,  వీఎఫ్ఎక్స్ స్టూడియో, ఏఐ, ఇత‌ర స‌దుపాయాల‌తో అంతర్జాతీయ ప్ర‌మాణాల‌తో కూడిన‌ స్టూడియో నిర్మాణానికి అవ‌కాశం క‌ల్పించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.


👉 అంత‌ర్జాతీయ స్థాయి  స్టూడియో నిర్మాణంతో పాటు సినీ ప‌రిశ్ర‌మ‌లో వివిధ విభాగాల‌కు అవ‌స‌ర‌మైన నిపుణులను అందుబాటులోకి తెచ్చేందుకు నైపుణ్య శిక్ష‌ణ కేంద్రం ఏర్పాటు చేసేందుకు అజ‌య్ దేవ‌గ‌ణ్ సంసిద్ధ‌త వ్య‌క్తం చేశారు.


👉 తెలంగాణ అభివృద్దికి ప్రభుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లు, వివిధ రంగాల అభివృద్ధికి తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  వివ‌రించారు. తెలంగాణ రైజింగ్‌కు సంబంధించి మీడియా, సినిమా రంగాల‌కు ప్ర‌చార‌క‌ర్త‌గా ఉంటాన‌ని అజ‌య్ దేవ‌గ‌ణ్ ముఖ్య‌మంత్రికి తెలియ‌జేశారు.