తిరుమలలో రెండు రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు !

J.SURENDER KUMAR,

తిరుమల శ్రీవారి దర్శనం కోసం జూలై 14, 15వ తేదిల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.


జూలై 16న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం ఘనంగా జరగనుంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని జూలై 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.


ఈ కారణంగా ఈ రెండు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా ఇతరులకు టీటీడీ రద్దు చేసింది.
ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సహకరించవలసినదిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.