తుంగతుర్తి లో 14 న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన !

👉 ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి లక్ష్మణ్ కుమార్!

J.SURENDER KUMAR,

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో ఈ నెల 14 న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఖరారు అయింది. నల్గొండ జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మంత్రి ఉత్తం కుమార్ రెడ్డితో శుక్రవారం ఏర్పాట్లు పరిశీలించారు.

సీఎం రేవంత్ రెడ్డి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం తో పాటు బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, ఎస్పీ, అధికార యంత్రాంగం తో పాటు సభా స్థలం, రూట్ మ్యాప్, తదితర అంశాలపై మంత్రులు ఉత్తం కుమార్ రెడ్డి, లక్ష్మణ్ కుమార్ సమీక్షించారు.

👉 2.4 లక్షల కొత్త రేషన్ కార్డుల పంపిణీ !

సీఎం రేవంత్ రెడ్డి కొత్తగా 2.4 లక్షల రేషన్ కార్డులను లాంచనంగా లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. గత ఆరు నెలల కాలంలో 41 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు.

11.3 లక్షల మంది నిరుపేదలకు ప్రయోజనం కలుగనున్నది. పంపిణీ రేషన్ కార్డులు కలుపుకొని రాష్ట్రంలో 94,72,422 రేషన్ కార్డు సంఖ్య చేరానున్నది. దీంతో రాష్ట్రంలో 3 కోట్ల 14 లక్షల మందికి లబ్ధి కలుగుతుంది.