👉 ఆదివాసీల ఆందోళన నేపథ్యంలో..
J.SURENDER KUMAR,
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అడవులను టైగర్ కన్వెన్షన్ రిజర్వుగా మార్చడానికి ప్రభుత్వం జారీ చేసిన జీవో 4 9 కి నిరసనగా సోమవారం ఆదివాసి సంఘాలు జిల్లా బందుకు పిలుపునిచ్చి నిరసన చేపట్టారు. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం జీవో 49 ని తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
👉 ఈ నేపథ్యంలో…
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అడవులను టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ (టైగర్ కారిడార్) కు సంబంధించిన జీవో (నంబర్ 49) ను ప్రభుత్వం నిలుపుదల చేసిన నేపథ్యంలో పలువురు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మంత్రి ధనసరి అనసూయ సీతక్క , ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తో పాటు ఆదివాసీ సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి ని కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ , వివేక్ వెంకటస్వామి తో పాటు పలువురు నేతలున్నారు.