ఉప రాష్ట్రపతి పదవి కి సాగర్ జీ .?

J SURENDER KUMAR,

ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గత సోమవారం తన పదవికి రాజీనామా, రాష్ట్రపతి ఆమోదం, ఆ పదవికి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయడంతో ఉప ఉపరాష్ట్రపతి పదవికి పలువురు నాయకుల పేర్ల ఊహగానాలతో ప్రచార మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర మాజీ గవర్నర్,  చెన్నమనేని విద్యాసాగర్ రావు  (సాగర్ జీ ) సమర్థుడే అనే చర్చ రాజకీయ విశ్లేషకులలో మొదలయింది.

👉 మోడీ మొదటి ప్రభుత్వంలో గవర్నర్ గా !

నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న సాగర్ జి రాజకీయ చరిత్రలో మచ్చలేని చరిత్ర, న్యాయ, రాజ్యాంగ కోవిదుడుగా గుర్తింపు కలిగిన చేన్నమనేని విద్యాసాగర్ రావు ను ప్రధాని నరేంద్ర మోడీ తన మొదటి ప్రభుత్వం 2014, ఆగస్టు లో మహారాష్ట్ర గవర్నర్ గా నియమించటంతో దేశంలోని వివిధ రాజకీయపార్టీల అగ్ర నేతలు ఉలిక్కిపడ్డారు.

👉 పటేల్ విగ్రహ కమిటీ కన్వీనర్ గా !

నాటి గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగిన నరేంద్ర మోడీ, రాష్ట్రంలో తలపెట్టిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ ప్రతిష్టాపనకు అవసరమైన ఇనుము సేకరణకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రనికి బిజెపి పార్టీ పక్షాన ఏర్పాటు అయిన కమిటీకి సాగర్ జీ ని ఆ పార్టీ అధినాయకత్వం కన్వీనర్ గా నియమించింది.

👉 రాజకీయ నేపథ్యం !

బిజెపిలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, నాయకుడిగా, సాగర్ జీ రాజకీయ ప్రస్థానంలో ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ జనసంఘ్ , విశ్వహిందూ పరిషత్, తో ముడిపడి ఉన్న సాగర్ జీ  బిజెపి పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్నారు


👉 మీసా చట్టం నమోదు అరెస్టు !

దేశంలో విధించిన ఎమర్జెన్సీని బహిరంగంగా వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన సాగర్ జీ  ని పోలీసులు కరీంనగర్ పరేడ్ గ్రౌండ్ లో జనం ముందు లాఠీలతో, తుపాకీ బాయినట్లతో తీవ్రంగా కొట్టారు. రక్త గాయాలతో పడి ఉన్న సాగర్ జీ పై ” మీసా ” చట్టం కింద కేసు నమోదు, అరెస్టు చేసి వరంగల్ జైల్లో సంవత్సరకాలంకు పైగా ఉంచారు.

ఉస్మానియా లా కళాశాల విద్యార్థి సంఘ ఎన్నికలలో ఏబీవీపీ విద్యార్థి సంఘ అధ్యక్ష పదవి పోటీచేసి వామపక్ష తీవ్రత విద్యార్థి సంఘం విద్యార్థులు  దాడిలో  సాగర్ జీ తీవ్రంగా గాయపడ్డారు. కరీంనగర్ లో న్యాయవాద వృత్తిని చేపట్టి,  ప్రముఖ క్రిమినల్ న్యాయవాదిగా గుర్తింపు పొందారు.

విద్యాసంస్థలలో ఏబీవీపీ బలోపేతం కావడానికి ఆర్ఎస్ఎస్,  విశ్వహిందూ పరిషత్, కార్యకలాపాల నిర్వాహకులకు సహాయ సహకారాలు అందిస్తూ ఆయా సంస్థలను బలోపేతం చేశారు.   పీపుల్స్ వాట్ పీపుల్స్ వార్,  ఇతర తీవ్రవాద, మతత్వ పార్టీలకు కొరకరాని కొయ్యగా తయారు కావడంతో  సాగర్ జీని వారు టార్గెట్ చేశారు.

మూడుసార్లు ఉమ్మడి రాష్ట్రంలో మెట్టుపల్లి ఎమ్మెల్యేగా, శాసనసభలో  బిజెపి పక్ష నాయకుడిగా రెండుసార్లు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా, ప్రధాని వాజ్ పాయ్  ప్రభుత్వంలో  హోం శాఖ సహాయ మంత్రిగా, కొన్ని నెలలపాటు వాణిజ్య  పన్నుల పరిశ్రమ శాఖ మంత్రిగా సాగర్ జీ  కొనసాగారు

👉 ఒక్క ఓటు రెండు రాష్ట్రాల తీర్మానం సాగర్ జి హయాంలో !

ఉమ్మడి రాష్ట్రంలో బిజెపి అధ్యక్షుడిగా కొనసాగిన సాగర్ జీ  హయాంలో కాకినాడలో జరిగిన బిజెపి కార్యవర్గ సమావేశంలో ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు తీర్మానం చేసి   రాష్ట్ర,  జాతీయ రాజకీయాలలో సంచలం సృష్టించారు.

బిజెపి పార్టీ అధ్యక్షుడుగా కొనసాగిన సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకొని బిజెపి పార్టీకి 12 అసెంబ్లీ సీట్లను 7 పార్లమెంటు స్థానాలు గెలిపించుకున్న క్రియాశీల రాజకీయ చతురతను నిర్వహించిన తీరు నేటికీ రాజకీయ వర్గాల్లో చర్చనీయంగా నిలిచింది.

బిజెపి అగ్ర నాయకులు వాజ్ పాయ్,  అద్వానీ మురళీ మనోహర్ జోషి, సుష్మా స్వరాజ్,  అరుణ్ జెట్లీ, స్వాదీ ఉమాభారతి,  రాజ్ నాథ్ సింగ్ వెంకయ్యనాయుడు, నాగపూర్ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం తో సాగర్ జీ కు ఎనలేని సాహిత్యం ఉంది.

👉 గవర్నర్ గా  తనదైన శైలిలో…

మహారాష్ట్ర లో గిరిజనుల అభివృద్ధి కోసం ” ట్రైబల్ సబ్ ప్లాన్ నిధులలో 5 శాతం నేరుగా స్థానిక గ్రామపంచాయతీలకు కేటాయించాలని సాగర్ జీ నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి ప్రత్యేక ఉత్తర్వులు జారీ  చేయించారు.

తమిళనాడు గవర్నర్ గా కొంతకాలం అదనపు బాధ్యతలు నిర్వహించిన  సాగర్ జీ,  సీఎం జయలలిత మృతి, శశికళ ఎపిసోడ్ లో తనదైన శైలిలో రాజ్యాంగబద్ధ  రాజకీయ చతురత తో సమస్య జటిలం కాకుండా చేశారు.

👉 చంద్రబాబుతో స్నేహ సంబంధాలు !

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సాగర్ జీ కి,  నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్ తో  మొదలైన స్నేహసంబంధాలు నేటికీ ఇద్దరి మధ్య బలంగా కొనసాగుతున్నాయి.

👉 ఎన్ డి ఏ  ప్రభుత్వంలో అచ్చి వస్తున్న అవకాశాలు !

వాజ్ పాయ్ ప్రభుత్వంలో హోంశాఖ సహాయ మంత్రిగా,  ప్రధానినరేంద్ర మోడీ ప్రభుత్వంలో మహారాష్ట్ర గవర్నర్ గా, సాగర్ జీ  పదవుల అలంకరించారు.  ప్రస్తుతం టిడిపి ఎంపీల మద్దతుతో కొనసాగుతున్న కేంద్ర ప్రభుత్వం లో  సీఎం చంద్రబాబు, బీహార్. సీఎం ల పాత్ర కీలకంగా మారిన నేపథ్యంలో సాగర్ జీ  కి ఉపరాష్ట్రపతి పదవి వరిస్తుందో ? లేదో అనే చర్చ తో పాటు బిజెపి పార్టీ తమకు తాము, స్వయంగా నిర్దేశించుకున్న 75 సంవత్సరాల వయస్సు అడ్డంకి కానున్నదా ? అనేదే ప్రశ్నార్థకం గా మారింది.

ప్రధాని నరేంద్ర మోడీ, తనదైన శైలిలో వ్యూహం అమలు చేస్తే, ఉపరాష్ట్రపతి పదవి ఎవరిని వరించనున్నదో ? వేచి చూడాల్సిందే అనే చర్చ జరుగుతోంది.