ఉప రాష్ట్రపతి అకస్మాత్తుగా రాజీనామా చేస్తే .. .?

J.SURENDER KUMAR,

భారత ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సోమవారం పంపించిన తన రాజీనామాలో ఆయన ఆరోగ్య కారణాలను పేర్కొన్నారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 67 (ఎ) ప్రకారం, భారత ఉపరాష్ట్రపతి పదవికి నేను తక్షణమే రాజీనామా చేస్తున్నాను’ అని ధన్‌ఖడ్ ఆ లేఖలో పేర్కొన్నారు. 74 ఏళ్ల ధన్‌ఖడ్ 2022 ఆగస్ట్‌లో ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. 2027 వరకు ఆయనకు పదవీ కాలం ఉన్నప్పటికీ సోమవారం రాజీనామా చేశారు. మంగళవారం రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.

👉 ఉప రాష్ట్రపతి అకస్మాత్తుగా రాజీనామా చేస్తే ఆయన బాధ్యతలను ఎవరు స్వీకరిస్తారు ?

👉 తదుపరి ఉపరాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారు, రాజ్యాంగంలో దీనికి సంబంధించిన నిబంధనలు ఏమిటి ?

👉 ఉపరాష్ట్రపతి కావడానికి అర్హతలు ఏమిటి, ఎన్నికల సంఘం నియమాలు ఏం చెబుతున్నాయి ?

👉 భారతదేశంలో రాష్ట్రపతి తరువాత అత్యున్నత రాజ్యాంగ పదవి ఉప రాష్ట్రపతే.!

👉 రాజ్యాంగంలోని 63 నుంచి 71వ అధికరణాలతో పాటు ఉపరాష్ట్రపతి (ఎన్నికల) నియమాలు- 1974 ప్రకారం ఈ పదవికి ఎన్నుకుంటారు.!

👉 జగ్‌దీప్ ధన్‌ఖడ్ రాజీనామాతో ఉప రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడినందున ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు కొత్త ఉప రాష్ట్రపతి ఎన్నికకు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.!

👉 ఉప రాష్ట్రపతి పదవి ఖాళీ అయితే వీలైనంత త్వరగా భర్తీ చేయాలని రాజ్యాంగంలో పేర్కొన్నారు.

👉 ఈ పదవికి ఎన్నిక నిర్వహించేందుకు వీలైనంత త్వరగా ఏర్పాట్లు చేయాలి.!

👉 రాజ్యాంగంలోని ఆర్టికల్ 68లోని సెక్షన్ 2 ప్రకారం… ఉప రాష్ట్రపతి మరణం, రాజీనామా, తొలగింపు వంటివి కానీ లేదా మరేదైనా కారణం వల్ల కానీ ఖాళీ ఏర్పడితే భర్తీ చేయడానికి వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించేలా నిబంధన ఉంది !

👉 సాధారణ పరిస్థితుల్లో అయితే పదవీ విరమణ చేస్తున్న ఉపరాష్ట్రపతి పదవీకాలం ముగియడానికి 60 రోజుల లోపు తదుపరి ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగాలి.!

👉 ఉపరాష్ట్రపతి పదవీకాలం ముగిసేలోపు ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది.!

👉 ఉపరాష్ట్రపతి మరణం, రాజీనామా, పదవినుంచి తొలగింపు వంటి కారణాలతో పాటు ఇంకేదైనా కారణాల వల్ల ఈ పదవి ఖాళీ అయితే భర్తీ చేయడానికి వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహిస్తారు.!

👉 రాజ్యాంగంలోని ఆర్టికల్ 66 ప్రకారం.. పార్లమెంటు ఉభయ సభల (లోక్‌సభ, రాజ్యసభ) సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటుంది.!

👉 దామాషా ప్రాతినిధ్యం ప్రకారం.. ఎన్నికలు సింగిల్ ట్రాన్సఫరబుల్ ఓటింగ్ పద్ధతిలో ఎన్నుకుంటారు. ఈ ఓటింగ్ రహస్య బ్యాలెట్ విధానంలో జరుగుతుంది.!

👉 భారత ప్రభుత్వం, ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థల్లో లాభదాయక పదవుల్లో ఉన్నవారు దీనికి అర్హులు కారు. అలాంటి పదవిలో ఉంటే వాటికి రాజీనామా చేశాకే ఉప రాష్ట్రపతి పదవికి పోటీ పడాల్సి ఉంటుంది.!

👉 ఎవరైనా ఉపరాష్ట్రపతి తన పదవీకాలం ముగిసేలోపు మరణించినా లేదా రాజీనామా చేసినా.. లేదంటే రాష్ట్రపతిగా వ్యవహరించడం ప్రారంభించినా.. అలాంటి సందర్భంలో ఉప రాష్ట్రపతి స్థానంలో ఎవరు ఆ బాధ్యతలు తీసుకోవాలో రాజ్యాంగంలో ప్రత్యేకంగా పేర్కొనలేదు.!

👉 భారత రాజ్యాంగం ప్రకారం.. ఉపరాష్ట్రపతి రాజ్యసభకు ఎక్స్-అఫిషియో చైర్‌పర్సన్. ఉపరాష్ట్రపతికి సంబంధించి రాజ్యాంగంలో ఒకే ఒక నిబంధన ఉంది, అది రాజ్యసభ ఛైర్మన్‌గా తన విధులకు సంబంధించినది.

👉 ఆ పదవి ఖాళీగా ఉంటే, ఆ బాధ్యతను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ లేదా భారత రాష్ట్రపతి అధికారం ఇచ్చిన రాజ్యసభ సభ్యుడు ఎవరైనా నిర్వహించొచ్చు.!

👉 భారతదేశంలో ఉపరాష్ట్రపతి దేశంలో రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవి. దీనికి పదవీకాలం అయిదేళ్లు. కానీ పదవీకాలం ముగిసిన తర్వాత కూడా, కొత్త ఉపరాష్ట్రపతి బాధ్యతలు స్వీకరించే వరకు ఆ పదవిలో కొనసాగవచ్చు.!

👉 ఉపరాష్ట్రపతి పార్లమెంటులోని ఏ సభలో కానీ.. రాష్ట్రాల శాసనసభల్లో కానీ సభ్యుడిగా ఉండరాదు.

👉 ఒకవేళ రాష్ట్రపతి మరణించినా.. రాజీనామా చేసినా.. అభిశంసనకు గురైనా.. లేదంటే ఇంకేదైనా కారణం వల్ల రాష్ట్రపతి పదవి ఖాళీ అయితే కొత్త రాష్ట్రపతి ఎన్నిక జరిగేవరకు ఉప రాష్ట్రపతే రాష్ట్రపతి బాధ్యతలు చూడాల్సి ఉంటుందని రాజ్యాంగం పేర్కొంది.!

👉 రాష్ట్రపతి గైర్హాజరు, అనారోగ్యం, మరే ఇతర కారణాల వల్ల తన విధులను నిర్వర్తించలేనప్పుడు, ఉప రాష్ట్రపతి వాటిని నిర్వర్తిస్తారు.! అలాంటి సమయంలో రాష్ట్రపతికి ఉండే అన్ని అధికారాలు కూడా ఆ బాధ్యతలు చూసే ఉప రాష్ట్రపతికి ఉంటాయి.!

👉 బిబిసి న్యూస్ సౌజన్యంతో