👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
గురుకుల విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూ ఉత్తమ ఫలితాలు సాధించండి, మీకు ప్రభుత్వ పరంగా సంపూర్ణ సహాయ సహకారాలు, ప్రశంసలతో పాటు మా ప్రభుత్వం నగదు పారితోషికం ఇస్తూ ఉపాధ్యాయుని ప్రోత్సహిస్తుందని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల అధ్వర్యంలో నడుస్తున్న గొల్లపల్లి (మగ్గిడి) గురుకుల పాఠశాల 2024–25 విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయ వర్గ కృషి, నిబద్ధత గుణాత్మక బోధన ఫలితంగా ఇంటర్మీడియట్ మరియు పదవ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించిన సందర్భంగా మంత్రి ఉపాధ్యాయులు అభినందించారు.
ధర్మపురి మంత్రి లక్ష్మణ్ కుమార్ క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ పక్షాన ₹ 5 లక్షల చెక్ ను ప్రోత్సాహక పారితోషికం అందించారు.
ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
👉 మంత్రి హామీనీ ఇచ్చారు అమలు చేశారు !

బుగ్గారం మండల కేంద్రానికి చెందిన దివ్యాంగుడు దూడ జాన్సన్ కు మంత్రి లక్ష్మణ్ కుమార్ సోమవారం ధర్మపురి క్యాంపు కార్యాలయంలో బ్యాటరీ సైకిల్ అందించారు.
గత నెల రోజుల క్రితం బుగ్గరం మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన మంత్రి లక్ష్మణ్ కుమార్ కు దూడ జాన్సన్, తాను శారీరిక వైకల్యంతో ఇబ్బంది పడుతున్న విషయాన్ని మంత్రికి మొరపెట్టుకున్నాడు. స్పందించిన మంత్రి త్వరలో నీకు బ్యాటరీ సైకిల్ ఇస్తానని హామీ సోమవారం సైకిల్ అందించారు.