J SURENDER KUMAR,
సామాజికంగా వెనుకబడిన విద్యార్థులు తమ విద్యను నిర్భయంగా కొనసాగించేందుకు మంచి అద్భుతమైన అవకాశం అని, విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించేందుకు అందించే ఈ ఆర్థిక సహాయం ఎంతో మేలు చేస్తుందని, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు

.
హైదరాబాద్ సచివాలయంలో శుక్రవారం లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కొత్తపేట, ఆధ్వర్యంలో మరియు ముత్తూట్ CSR ఫౌండేషన్ సహకారంతో ప్రభుత్వ మెడికల్, ఇంజినీరింగ్, నర్సింగ్ కళాశాలల్లో మెరిట్ ద్వారా ప్రవేశం పొందిన విద్యార్థులకు కోర్సు పూర్తి అయ్యేంత వరకు పూర్తిస్థాయి ఫీజులు ఇచ్చే విధంగా ₹ 40 లక్షల రూపాయల చెక్కులు మంత్రి లక్ష్మణ్ కుమార్ పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో 21 మంది విద్యార్థులు అర్హులుగా ఎంపికయ్యారు. ఇందులో 10 మంది MBBS విద్యార్థులు,10 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు,1 నర్సింగ్ విద్యార్థి ఉన్నారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..

విద్యను అందరికీ అందుబాటులోకి తేవాలనే సంకల్పంతో లయన్స్ క్లబ్ మరియు ముత్తూట్ ఫౌండేషన్ మేనేజర్ లక్ష్మీనారాయణ ప్రత్యేక చొరవ చూపడం అభినందనీయమని, నిర్వాహకులను మంత్రి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, కళాశాలల ప్రతినిధులు హాజరయ్యారు.