J.SURENDER KUMAR,
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ & ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇంచార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం దర్శించుకున్నారు.

నల్గొండ జిల్లా సమీక్ష సమావేశంలో పాల్గొనడానికి వెళుతున్న మంత్రి లక్ష్మణ్ కుమార్ ముందుగా యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు.


ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య, జిల్లా కలెక్టర్ హనుమత రావు, నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు వేద పండితులు, మంగళ వాయిద్యాలతో మంత్రికి పూర్ణకుంభ స్వాగతం పలికారు.

దర్శనానంతరం ఆలయ మండపంలో వేద పండితులు మంత్రికి వేద ఆశీర్వచనం చేసి ఆలయ కార్య నిర్వహణ అధికారి వెంకట్ రావు ప్రసాదం, స్వామివారి చిత్రపటం అందించారు. సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి కి పోలీస్ యంత్రాంగం గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు.
