👉 మాజీ మంత్రి టీ .జీవన్ రెడ్డి !
J.SURENDER KUMAR,
జగిత్యాల పట్టణ మున్సిపాలిటీలో ₹15.6 కోట్ల నిధులతో వివిధ వార్డుల్లో జరుగుతున్న పనులు ఏ నిబంధనలతో చేస్తున్నారో ? అనే అంశంపై జిల్లా కలెక్టర్ పర్యవేక్షించాలని మాజీమంత్రి టిజీవన్ రెడ్డి కోరారు. జగిత్యాల పట్టణం ఇందిరాభవన్ లో సోమవారం జీవన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.
👉 జీవన్ రెడ్డి మాటల్లో….
సింగిల్ ప్యాకేజ్ గా రూపొందించి పనులు చేపట్టడంతో స్థానిక కాంట్రాక్టర్లకు అవకాశం లేదు లేదు అని కేవలం 15 శాతం మాత్రమే బీట్ రోడ్డు తో స్పెషల్ గ్రేడ్ కాంట్రాక్టర్లు హాట్ మిక్సర్, వెయిట్ ప్లాంట్ ఉన్న వారు మాత్రమే పాల్గొనే అవకాశం ఉండడంతో స్థానికులు కాంట్రాక్ట్ లో పాల్గొనే అవకాశం లేదని కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యంతరం వ్యక్తం చేశారు.
నిబంధనల మేరకు టెండర్ ఫార్మాలిటీస్, అగ్రిమెంట్ చేసుకున్న తర్వాతనే వర్క్ ఆర్డర్ జారీ చేయాలి. ఏవిధమైన టెండర్ అగ్రిమెంట్ కాలేదు.. ఎటువంటి వర్క్ ఆర్డర్ లేకుండా పది వార్డుల్లో పనులు జరుగుతున్నాయి అని జీవన్ రెడ్డి ఆరోపించారు
మున్సిపల్ అధికారులు మార్కౌట్ ఇస్తున్నారా ? లేక కాంట్రాక్టర్ ఎటువంటి అనుమతులు లేకుండా పనులు చేస్తున్నారా.!.లేక మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లేకుండానే పనులు చేస్తున్నారా..?
ఆన్ లైన్ లో ఇంజనీరింగ్ అధికారులు ధృవీకరణ లేకుండా పనులు చేపట్టడం ఆశ్చర్యం కలిగిస్తుంది. జీవన్ రెడ్డి అన్నారు.
అగ్రిమెంట్ లేకుండా, పనులు చేపట్టడం తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో చూడలేదు అన్నారు. గౌరి శంకర్ ఇన్ఫ్రా లిమిటెడ్ ఎవరు ? వారికి ప్రభుత్వ నిబంధనలు వర్తించవా, చట్టంలో ప్రత్యేక మినహాయింపు ఏమైనా ఇచ్చారా.?
👉 ఈ సూపర్ మ్యాన్ ఎవరు ?
రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో జగిత్యాల మున్సిపాలిటీలో మార్పు వచ్చింది అనుకున్నాం. కానీ గత బీఆర్ఎస్ పాలన మున్సిపాలిటీ గానే కనపడుతోంది. ప్రత్యేక అధికారి కలెక్టర్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ నియమ నిబంధనలను అనుగుణంగా పనులు జరుగుతాయి ఆశిస్తే గత బీ ఆర్ ఎస్ పాలన కనపడుతుంది అని జగిత్యాల మున్సిపాలిటీలో ఏం జరుగుతుందో కలెక్టర్ పర్యవేక్షించాలి జీవన్ రెడ్డి కోరారు.
👉 సీఎంకు లేఖ రాస్తా…
జగిత్యాల జిల్లా లో ఎటువంటి అగ్రిమెంట్ లేకుండా, వర్క్ ఆర్డర్ జారీచేయకుండా చేపడుతున్న పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి లేఖా ద్వారా తీసుకెళ్తున్న…ఇంజనీరింగ్ అధికారులు
స్పందించి, అగ్రిమెంట్ పూర్తి అయితే మీడియా ఎదుట అగ్రిమెంట్ పేపర్లు ప్రవేశపెట్టాలి..అగ్రిమెంట్ అయింది ఎప్పుడూ..వర్క్ ఆర్డర్ ఎప్పుడూ ఇచ్చారు..అధికారులు చెప్పాలి ఫోటో జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పారదర్శక పాలన అందిస్తుంటే జగిత్యాల మున్సిపాలిటీ మాత్రం ప్రభుత్వం మారిన తర్వాత కూడా జగిత్యాల మున్సిపాలిటీలో మార్పు రాకుంటే ఎలా.?అగ్రిమెంట్ లేకుండా..వర్క్ ఆర్డర్ లేకుండా పనులు చేపట్టవచ్చా అధికారులు చెప్పాలి ?
గౌరి శంకర్ ఇన్ఫ్రా లిమిటెడ్..ఎవరు..?
చట్టాలకు అతీతంగా వ్యవహరించే ఈ సూపర్ మ్యాన్ ఎవరు ? అధికారులు బయటకు తీయాలి..కలెక్టర్ విచారణ చేపట్టాలి..బాధ్యుల పై చర్యలు చేపట్టాలి. జీవన్ రెడ్డి మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో బండ శంకర్ , కళ్లేపల్లి దుర్గయ్య, గాజుల రాజేందర్, జున్ను రాజేందర్, కొండ్ర జగన్, పూర్ణ చందర్ రెడ్డి, షేక్ చాంద్ పాషా, మన్సూర్, మున్నా, నేహాల్, పుప్పాల అశోక్, రఘు, రజనీకాంత్ , గుండ మధు , హరీష్ , రాజేశ్ , ప్రదీప్ , అభి , సాయి , తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
👉 మీడియా సమావేశం కు ముందు గా..
మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆద్వర్యంలో ఏ ఐ సీ సీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జన్మ దిన వేడుకలను ఘనంగ నిర్వహించి కేక్ కట్ చేశారు.