అధికారులే ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రతిబింబాలు !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,

అధికారులే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రతిబింబాలు, అధికారులు  సమర్ధవంతంగా పనిచేస్తే ముఖ్యమంత్రి మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్తారని, భవిష్యత్తులో కొత్త పథకాలను కూడా అమలు చేసే అవకాశం ఉందని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్‌లోని షెడ్యూల్డ్ కులాల శాఖ కమిషనర్ కార్యాలయంలో, కమిషనర్ ఎన్. క్షితిజ్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన అడిషనల్ డైరెక్టర్ శ్రీమతి డి. ఉమాదేవి పదవీ విరమణ కార్యక్రమంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.


👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…


మనది ఫ్రెండ్లీ ప్రభుత్వం ముఖ్యమంత్రి తన పై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. అధికారుల సమన్వయం, సహకారం ఉంటేనే ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి మంచి పేరు వస్తుందని మంత్రి స్పష్టం చేశారు.

👉 కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విప్లవాత్మక మార్పులు తెచ్చిందని, సంక్షేమ శాఖలో ఏవైనా అవసరాలు ఉంటే నేరుగా తనను సంప్రదించాలని, సమస్యలపై చర్చించి సమిష్టి నిర్ణయం తీసుకుంటామని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

👉 36 సంవత్సరాల పాటు సంక్షేమ శాఖలో సేవలందించిన అడిషనల్ డైరెక్టర్ డి. ఉమాదేవి కృషిని మంత్రి కొనియాడారు. ఇటీవల జరిగిన సమీక్ష సమావేశాల్లో ఆమె సమర్ధతను ప్రస్తావిస్తూ, పదవీ విరమణ తర్వాత కూడా ఆమె అనుభవాన్ని శాఖ అభివృద్ధికి ఉపయోగించుకుంటామని తెలిపారు. అనంతరం మంత్రి లక్ష్మణ్ కుమార్, ఉమాదేవిని శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు.

👉 ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, అడిషనల్ డైరెక్టర్లు సి. శ్రీధర్, హనుమంతు నాయక్, జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన డిప్యూటీ డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, కమిషనర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.