J SURENDER KUMAR,
మహారాష్ట్ర లో సంభవించిన వరదలలో మృతి చెందిన వారి కుటుంబానికి అండగా ఉంటాం ప్రభుత్వ పరంగా అన్ని విధాల ఆదుకోవడానికి కృషి చేస్తామని మైనారిటీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని శివారు తారక రామా నగర్ కు చెందిన కొందరు ఇటీవల మహారాష్ట్ర వరదల్లో చిక్కుకొని మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను బుధవారం మాజీ మంత్రి జీవన్ రెడ్డి తో కలిసి వారి కుటుంబాలను పరామర్శించి మంత్రి లక్ష్మణ్ కుమార్ సానుభూతి తెలిపారు.

జరిగిన సంఘటన వివరాలు, కుటుంబాల నేపథ్యం వివరాలు అడిగి తెలుసుకొని ప్రభుత్వ పక్షాన, మహారాష్ట్ర ప్రభుత్వం ద్వారా సాధ్యమైనంత మేరకు ఆర్థిక సహాయం అందించడానికి చర్యలు చేపడతానని గారికి వివరించి ఓదార్చారు.