👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
ఆసియా గిన్నిస్ రికార్డుల్లో స్థానం దక్కించుకోవడం, ఇంగ్లీష్ చానల్‌ను ఈది (స్విమ్మింగ్) ఆసియా గిన్నిస్ రికార్డుల్లో స్థానం దక్కించుకున్న తొలి తెలుగు మహిళగా క్వీని విక్టోరియా చరిత్ర సృష్టించడంతో పాటు రామసేతును విజయవంతంగా ఈదడం వంటి అరుదైన విజయాలను సొంతం చేసుకున్నా తల్లి ,తనయులు తమ స్విమ్మింగ్ ప్రతిభతో దేశానికి తెలంగాణ రాష్ట్రానికి పేరు తేవడం గర్వకారణం అని ఎస్సీ , ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా నుంచి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన స్విమ్మర్లు క్వీని విక్టోరియా గంధం, స్టిఫెన్ కుమార్ గంధం, గురువారం హైదరాబాద్ సచివాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కలిసిన స్విమ్మర్లకు అభినందనలు తెలిపారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ….
త్వరలో వీరు అమెరికాలోని కాథలినా చానెల్ ను ఈదేందుకు సిద్ధమవుతున్నా నేపథ్యంలో ఈ యాత్ర కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.
ఇలాంటి ప్రతిభావంతుల్ని ప్రోత్సహించడం తమ బాధ్యత… త్వరలోనే ముఖ్యమంత్రికి నివేదించి తగిన ఆర్థిక సాయం, ప్రోత్సాహం అందజేస్తాం అని సిమ్మార్లకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి అన్నారు.
తమను గౌరవించి ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రికి క్వీన్ విక్టోరియా గంధం, స్టిఫెన్ కుమార్ గంధంలు, కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ప్రచారంతో ప్రపంచ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి గొప్ప పేరు సాధించి పెడతామని వారు ధీమా వ్యక్తం చేశారు.