👉 బీఆర్‌ఎస్ నేత, ఆర్‌ఎస్ ప్రవీణ్ పై మండిపడ్డ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J SURENDER KUMAR,
అవినీతి అక్రమ పనులు మీరు చేసి మమ్మల్ని బదనాం చేస్తారా ? మాపై అడ్డగోలుగా ఆరోపణలు చేయడం మానుకోవాలి, దోచుకోవడం మీకు అలవాటు, మాకు కాదు అంటూ, బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ పై, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ,సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు.
👉 జగిత్యాల పట్టణం వైద్య కళాశాల వసతి గృహంలో బుధవారం సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
👉 గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రవీణ్ ఏం చేశారో ? అందరికీ తెలుసని, బహుజన్ సమాజ్ పార్టీ ( బీ ఎస్.పి ) నాయకుడిగా కొనసాగినప్పుడు కేసీఆర్ గురించి ఏం మాట్లాడవో ? ప్రస్తుతం ఆ పార్టీలో చేరి కెసిఆర్ గూర్చి ఏ విధంగా మాట్లాడుతున్నావో ? యూట్యూబ్ లో నీ వీడియోలే సాక్ష్యం, ఆ వీడియోలు బయట పెట్టమంటావా ? అంటూ మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రవీణ్ ను నిలదీశారు.
👉 జీవో 17 గూర్చి ప్రవీణ్ కుమార్ కు సరైన అవగాహన లేదని, విద్యార్థుల సమస్యలపై ఏనాడైనా ఆర్‌ఎస్ ప్రవీణ్ స్పందించారా ? అని మంత్రి ప్రశ్నించారు. గురుకుల పాఠశాల ల సెక్రటరీగా పని చేసి మరో రాజకీయ పార్టీలో చేరిన ప్రవీణ్ కుమార్ నాటి సీఎం కెసిఆర్ విద్యార్థుల సంక్షేమం గూర్చి ఎలా మాట్లాడారు, ఏమి మాట్లాడారో, వీడియోలో భద్రంగా ఉన్నాయని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
👉 గుడ్ల కొనుగోలు వ్యవహారంలో ₹ 600 కోట్ల అవినీతి జరిగింది అనే ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. అడ్డగోలుగా ఆరోపణలు చేయడం ప్రవీణ్ కుమార్ మానుకోవాలి. అంటూ మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జిల్లా పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.