బీసీ రిజర్వేషన్లు బిల్లును ఆమోదించండి రాష్ట్రపతికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి !


J.SURENDER KUMAR ,

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించిన బిల్లులను తక్షణం ఆమోదించాలని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మరోసారి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ ఇస్తే కలిసి విజ్ఞప్తి చేయడానికి ఢిల్లీ వచ్చినట్టు తెలిపారు.


👉  మంత్రివర్గ సభ్యులు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీలో ముఖ్యమంత్రి గురువారం ఢిల్లీలో  పత్రికా సమావేశంలో మాట్లాడారు. బీసీలకు విద్య, ఉద్యోగావకాశాల్లో, అలాగే స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించడానికి శాసనసభ రెండు బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.


👉 స్థానిక సంస్థల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతంకంటే మించి ఉండడానికి వీలులేకుండా గతంలో చేసిన చట్టం అడ్డంకిగా మారడంతో ఆ పరిమితిని ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిందనీ, ఆ ఆర్డినెన్స్‌ను కూడా గవర్నర్  రాష్ట్రపతి కి పంపించారని గుర్తు చేస్తూ ఈ మూడింటిని తక్షణం ఆమోదించాలని కోరారు.


👉  బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న చిత్తశుద్ధితో రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ అన్ని ప్రయత్నాలు చేసిందని,  రాష్ట్రపతి  వద్ద పెండింగ్‌లో ఉన్న కారణంగానే వారిని కలిసి విజ్ఞప్తి చేయడానికి మొత్తం మంత్రివర్గంతో పాటు ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలంతా ఢిల్లీ వచ్చినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ పరంగా చిత్తశుద్ధితో అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, ఈ విషయంలో కేంద్రం నుంచి సహకారం లభించలేదని పేర్కొన్నారు. తదుపరి కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.