భక్తుల సౌకర్యాలకు కృషి చేయండి పాలకవర్గ పదవి స్వీకారంలో…

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన కోటిలింగాల కోటేశ్వర ఆలయ స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాల కల్పనకు పాలకవర్గ సభ్యులు కృషి చేయాలని  రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మరియు వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


ఆదివారం కోటి లింగేశ్వర స్వామినీ మంత్రి లక్ష్మణ్ కుమార్, దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పాలకవర్గ కమిటీ చైర్మన్ పూదరిరమేష్, పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

బాధ్యతలు చేపట్టిన చైర్మన్ మరియు సభ్యులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి పాలకవర్గం సంపూర్ణ నిబద్ధతతో పనిచేయాలని మంత్రి అన్నారు.