👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J SURENDER KUMAR,
స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ భారత దేశంలో సాంకేతిక విప్లవ సారథిగా గుర్తింపు పొంది దేశమును ప్రపంచంతో పోటీ పడే స్థాయికి చేర్చిన దూరదృష్టి గల నాయకుడు రాజీవ్ గాంధీ అని రాష్ట్ర. ఎస్సీ, ఎస్టీ ,మైనారిటీ, దివ్యాంగుల
సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు .
మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా బుధవారం ధర్మపురి పట్టణంలోని నంది చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి రాజీవ్ గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.
దేశంలో మతసామరస్యం కోసం సద్భావన యాత్ర చేపట్టారు. కంప్యూటర్ రంగానికి పెద్ద ఎత్తున ప్రాధాన్యతనిచ్చిన ఫలితంగానే నేడు ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఐటీ రంగంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు అని అన్నారు.
అంతర్జాతీయ విమానాశ్రయాల రూపకల్పన, 18 ఏళ్ల యువతకు ఓటు హక్కు, గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు చేరే విధానాన్ని రాజీవ్ గాంధీ హాయంలోని ప్రవేశపెట్టారు అని వివరించారు.