బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే కాలేశ్వరం అవినీతి తెలిసింది !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

బిఆర్ఎస్ ( భారత రాష్ట్ర సమితి)  అధికారంలో ఉన్న కాలంలోనే కాలేశ్వరం ప్రాజెక్టులో పిల్లర్లు కూలిపోవడం, పగుళ్లు రావడం, ప్రాజెక్టుకు కుంగిపోవడ తదితర అవినీతి అంశాలు రాష్ట్ర ప్రజలతో పాటు, దేశ ప్రజలకు తెలిసిందే అని, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ,మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖమంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  అన్నారు.


గోదావరిఖని పట్టణం తిలక్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ 44వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ ఎండీ ముస్తఫా నివాసంలో మంగళవారం మంత్రి లక్ష్మణ్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు.

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాటలలో..


సోమవారం కన్నెపల్లి పంప్ హౌజ్ వద్ద బీఆర్ఎస్ నేతలు ఆందోళనలు, ధర్నాలు మళ్లీ పాత డ్రామాలను  ఆడుతున్న ప్రజలు నమ్మడం లేదని మంత్రి అన్నారు.


👉 పది సంవత్సరాల కాలం పాటు  అధికారంలో ఉండి, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పేరుతో వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డవారు నేడు మళ్లీ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని  మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.


👉 ప్రాజెక్ట్‌లో ఏర్పడిన అనేక లోపాలను దేశంలోనే అత్యున్నత స్థాయి నిపుణుల బృందం  నిపుణులైన నేషనల్ డ్యామ్ సేఫ్టీఅథారిటీ (NDSA) కాలేశ్వరం ప్రాజెక్ట్ పనితీరు ప్రశ్నార్థకమై, నీటిని తప్పించడమే మార్గమని మీరు అధికారంలో ఉన్నప్పుడే  వివరించిన విషయం మరిచారా ? అని మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు.


👉 కాలేశ్వరం ప్రాజెక్టు  అవినీతి అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదిక సోమవారం సింగిల్ ఎజెండాగా క్యాబినెట్ ఆమోదించిందని మంత్రి అన్నారు.

👉 ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి చట్టసభలలో అన్ని రాజకీయ పార్టీలకు కమిషన్ నివేదికపై చర్చించే అవకాశం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారని మంత్రి అన్నారు.

👉 కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి అక్రమాలు, వాస్తవాలు బీఆర్ఎస్ అవినీతి ప్రజలకు బహిర్గతం అవుతాయని, ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఎన్ని ఎకరాలకు సాగునీరు ఇచ్చారో   చెప్పగలరా? అంటూ బీఆర్ఎస్ నాయకులను మంత్రి లక్ష్మణ్ కుమార్  డిమాండ్ చేశారు.

👉 మా ప్రభుత్వం  రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందనీ, కేవలం 9 రోజుల్లో ₹ 9,000 కోట్లు రైతు భరోసా పథకంగా పంపిణీ, ₹ 2 లక్షల రైతులకు రుణమాఫీ, మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు, సన్నల కోసం ప్రతి క్వింటాల్‌కు ₹ 500 బోనస్, తదితర సంక్షేమ పథకాలు అమలు చేసినట్టు మంత్రి మీడియా సమావేశంలో వెల్లడించారు.

మీడియా సమావేశంలో   కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాల్వ లింగస్వామి, మాజీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి, పీసీసీ సెక్రటరీ పెద్దెల్లి ప్రకాష్, పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్, బీసీ సెల్ అధ్యక్షుడు గట్ల రమేష్, నాయకులు బొమ్మక రాజేష్, సింహాచలం, పెద్దపల్లి జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ ధూళికట్ట సతీష్, నాయకులు మండ రమేష్, డేవిడ్, నర్సోజీ, మట్ట శివ, ఓంకార్, సాజిద్ తదితరులు పాల్గొన్నారు.

👉🏻 తాండూరి శ్రీనివాస్ కు నివాళులు అర్పించిన మంత్రి !

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమీప బంధువులు తాండూరి శ్రీనివాస్ మంగళవారం గుండెపోటుతో గోదావరిఖనిలో మృతి చెందారు. శ్రీనివాస్ మృతదేహానికి నివాళులర్పించి 
అంతిమయాత్ర దహన సంస్కారాలలో మంత్రి పాల్గొన్నారు.