👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
గత పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో పేద ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోలేదని, కనీసం ఏ ఒక్కరికి రేషన్ కార్డు జారీ చేయలేదని, గత ప్రభుత్వంలో రేషన్ కార్డుల కోసం వినతి పత్రాలు పట్టుకొని ఆఫీసుల చుట్టూ ప్రజలు తిరిగారని ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మపురి నియోజకవర్గ ధర్మారం మండలంలో ₹45 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఐటీఐ కళాశాల భవన నిర్మాణానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ లతో కలిసి సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శంకుస్థాపన చేశారు. అనంతరం లబ్దిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
👉 ఈసందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలనలో భాగంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, రైతులకు ₹ 2 లక్షల రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ₹500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఎస్సీ వర్గీకరణ కు చట్టబద్ధత, స్థానిక సంస్థ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు తదితర సంక్షేమ పథకాల అమలను మంత్రి వివరించారు
👉 మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ,.

గోదావరిపై ఆంధ్ర ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్ ను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తుందని మంత్రి అన్నారు.రెండు చట్టాలకు ఆ ప్రాజెక్టు వ్యతిరేకమని మంత్రి ఉత్తమ్ కుమార్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై రేపు క్యాబినెట్ లో జ్యుడీషియల్ రిపోర్ట్ ను సోమవారం క్యాబినెట్ లో ప్రవేశపెడతామని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తెలిపారు.