👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి సంక్షేమ శాఖపై గత పాలకులు సమీక్ష చేయకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాక పేద ప్రజలకు అందాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలు నష్టపోయాము అని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , అధ్యక్షతన సోమవారం సచివాలయంలో శాఖపరమైన సమీక్షా సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వ పక్షాన సామాజిక సంక్షేమ శాఖకు రావలసిన నిధుల అంశంల పై ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించారు.
👉 ఈ సమావేశంలో రాష్ట్ర ముఖ్య కార్యదర్శి (CS) మరియు సామాజిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శులతో నిధులపై విస్తృతంగా చర్చించారు. ఆయా శాఖల పరంగా వివిధ అంశాలను ఆయా శాఖలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావలసిన నిధుల వివరాలను, కేంద్రం నిధులు విడుదల చేయకుండా జాప్యం, తదితర విషయాలపై మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆయా శాఖల ఉన్నతాధికారుల నుండి వివరాలు కోరారు.
👉 ప్రభుత్వ పక్షాన నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడానికి నివేదిక సిద్ధం చేశారు. మంత్రి గా బాధ్యత చేపట్టిన తర్వాత ఒక దాని తర్వాత ఒకటి సమీక్షిస్తూ, సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా అందుబాటులోకి తేవాలి అనే అంశంపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి నిర్ణయాలు తీసుకుంటున్నాను” మంత్రి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఉద్దేశించి అన్నారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…

👉 ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలనే దిశగా చర్యలు చేపడతామని, విద్యా విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు.
👉 గురుకులాల్లో భోజనాలు ( డైట్ ) విషయంలో నాణ్యత ప్రమాణాలు ఉండాలని, దానికి కావాల్సిన నిధులు ప్రభుత్వం అందిస్తుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు.
👉 తాను త్వరలోనే ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి నివేదికను ప్రత్యక్షంగా అందించి, రాష్ట్రానికి రావాల్సిన నిధులు త్వరితగతిన మంజూరు కు కృషి చేస్తామని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఈ సందర్భంగా అధికారులకు స్పష్టం చేశారు.