చొప్పదండి అసెంబ్లీలో  జనహిత పాదయాత్ర !

👉 రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు..

J.SURENDER KUMAR,

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ముఖ్య అతిథిగా చొప్పదండి నియోజక వర్గం గంగాధర మండలం ఉప్పర మల్యాల, గ్రామం నుండి మధురానగర్ గంగాధర (వయా కురిక్యాల) వరకు ఆదివారం జరిగింది.


ఎమ్మెల్సీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్,  పాదయాత్రలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్,  వివేక్ వెంకట స్వామిలతో కలిసి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.

అనంతరం మధురానగర్ చౌరస్తాలో జరిగిన కార్నర్ మీటింగ్ లో పాల్గొని ప్రసంగించారు. ప్రజాపాలన చేస్తున్న అభివృద్ధి పనులు రైతాంగానికి రుణమాఫీ, స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రేషన్ కార్డుల పంపిణీ, రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ తదితర అభివృద్ధి పనులను నాయకులు తమ తమ ప్రసంగంలో వివరించారు.