J.SURENDER KUMAR,
వినాయక చవితి పర్వదినం సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి గణపతి పూజను చేశారు.
విఘ్నాలను తొలగించి విజయపథంలో నడిపించే విఘ్నేశ్వరుడి కరుణా కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని ప్రార్థిస్తూ సీఎం. రేవంత్ రెడ్డి ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు.