J SURENDER KUMAR,
ఆత్మ బలిదానాలతో తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రధాన భూమిక పోషించిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు కోరిన తరహాలో విద్యానందిస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధికి కృతజ్ఞతలు అని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
హైదరాబాదు లో శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ..
గత పది సంవత్సరాలుగా రాజ్యం ఏలిన ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీకి రాలేదన్నారు. కేవలం రెండు సంవత్సరాల లోనే సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి విద్య, మౌలిక సదుపాయాల కల్పనకు హామీ ఇవ్వడం అభినందనీయమని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మపురి నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్న విద్యాసంస్థలలో 70 శాతం ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు, 30 శాతం ఇతరులకు అవకాశం ఉంటుందన్నారు. ఏ నియోజకవర్గంలోనూ హైవే ఆనుకొని ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వ భూమి లేదని, ఒక్క ధర్మపురి నియోజకవర్గంలోనే ఉందని మంత్రి అన్నారు. ప్రభుత్వ భూమిని కాపాడిన ఘనత స్తంభంపల్లి, పాశీగామా గ్రామ ప్రజలకే దక్కుతుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.