J SURENDER KUMAR,
తెలంగాణలో అమిటీ యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఛాన్స్‌లర్ అతుల్ చౌహాన్ కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ విద్యా రంగం అభివృద్ధికి తమ వంతుగా సేవలు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అమిటీ యూనివర్సిటీ ఛాన్సలర్ అతుల్ చౌహాన్ తెలిపారు. ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసంలో గురువారం ముఖ్యమంత్రిని అతుల్ చౌహాన్ కలిశారు.
రాష్ట్రంలో స్కిల్స్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ తో తాము ఒప్పందం చేసుకుంటామని, స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాల్లో భాగస్వాములము అవుతామని చౌహాన్ తెలిపారు. మెరుగైన వసతులు, నాణ్యమైన విద్యా బోధనతో ఇప్పటికే అమిటీకి మంచి పేరు ఉందని, తెలంగాణలో మరింతగా రాణించేందుకు కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో అమిటీ యూనివర్సిటీ ప్రతినిధి రామచంద్రం పాల్గొన్నారు.