J.SURENDER KUMAR,
ప్రపంచ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు గల ఉస్మానియా యూనివర్సిటీ గడ్డకు వచ్చి విద్యార్థుల, యూనివర్సిటీ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
👉 యూనివర్సిటీ లో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి లక్ష్మణ్ కుమార్ ను విద్యార్థులు పూలమాలవేసి ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ప్రాంగణంలోని ఆర్ట్స్ కళాశాల ముందు సోమవారం మంత్రి లక్ష్మణ్ కుమార్, మీడియా సమావేశంలో మాట్లాడారు.

👉 తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందుండి కీలక పాత్ర పోషించిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల సంక్షేమం పట్ల సీఎం రేవంత్ రెడ్డి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం, ఈరోజు ఠాగూర్ ఆడిటోరియంలో సీఎం ప్రసంగం అని మంత్రి అన్నారు.
👉 తెలంగాణ రాష్ట్రం వస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయి, మా జీవితాలు బాగుపడతాయని ఎందరో విద్యార్థులు ఆత్మబలిదానం చేసుకొని సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నాటి ప్రభుత్వం విద్యార్థుల, యూనివర్సిటీలో సమస్యలు పట్టించుకో లేదని మంత్రి అన్నారు.
👉 యూనివర్సిటీ క్యాంపస్ లో ఒక్క పోలీసు లేకుండా డిసెంబర్ మాసంలో వస్తాను, ఆర్ట్స్ కళాశాల ముందు సమావేశం పెడతాను. మీ సమస్యలు చెప్పండి, మీ ముందే మీ సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేస్తానని హామీ ఇచ్చిన ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విద్య పట్ల, విద్యార్థుల సమస్యల పట్ల ఉన్న చిత్తశుద్ధి కి ప్రత్యక్ష నిదర్శనం అని మంత్రి అన్నారు
👉 ఉస్మానియా యూనివర్సిటీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, విద్యార్థుల పక్షాన, మాదిగ సామాజిక వర్గానికి చెందిన క్యాబినెట్ మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డికి, ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలను తెలుపుతున్నానని మంత్రి లక్ష్మణ్ కుమార్ మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.