👉 ధర్మపురి తహసిల్దార్ కు తపస్ ఆధ్వర్యంలో వినతి !
J SURENDER KUMAR,
సిపిఎస్ విధానాన్ని తక్షణం రద్దు చేయాలని ధర్మపురి మండలం
తపస్ ఆధ్వర్యంలో శనివారం వినతి పత్రం ఇచ్చారు. 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 23 న జీవో 28 ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగస్తులందరినీ సిపిఎస్ విధానాల్లోకి నెట్టి వేయబడింది వినతి పత్రంలో పేర్కొన్నారు.
సిపిఎస్ విధానం ద్వారా పదవి విరమణ తర్వాత ఉద్యోగుల జీవితం స్టాక్ మార్కెట్ లావాదేవీలపై ఆధారపడి దయనీయంగా ఉంటుందని 61 ఏళ్ల పాటు ప్రభుత్వానికి సేవలందించిన ఉద్యోగులకు జీవితం చరమాంకల్లో దుర్భర పరిస్థితిలో గడపడం చాలా బాధాకరమని, పేర్కొన్నారు.
సిపిఎస్ విధానాన్ని పూర్తిగా రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ధర్మపురి తాసిల్దార్ కు ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బాధ్యులు బండి మహేష్, కాశెట్టి రమేష్, శీలం రాజేష్ బండి ప్రవీణ్, బక్క శెట్టి రవీందర్ , మారంపల్లి రాజేష్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కాసెట్టి శ్రీనివాస్, కనపర్తి సంతోష్ మండల బాధ్యులు, బి శ్రీనివాసరావు , కాశెట్టి వెంకటరమణ, గడిపెల్లి కిరణ్ ,బుగ్గారపు హరీష్ , చల్ల కృష్ణ , ఎస్ కన్నం నాయుడు తదితరులు పాల్గొన్నారు.
👉 జగిత్యాల జిల్లా కేంద్రంలో..

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ విధానం రద్దు చేసి వెంటనే ఓపిఎస్ విధానాన్ని అమలు పరచాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (TPUS) జగిత్యాల జిల్లా శాఖ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తపస్ నిరసన కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలిపారు.
మధ్యాహ్న భోజన విరామ సమయంలో జగిత్యాల అర్బన్ రూరల్ మండలాల తహసిల్దార్ ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పిస్తూ సాయంత్రం జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా సెప్టెంబర్ ఒకటి 2004 తర్వాత నియామకమైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసారు.
ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర సహాధ్యక్షుడు ఏ .నరేందర్ రావు ,రాష్ట్ర ఉపాధ్యక్షుడు వడ్నాల రాజశేఖర్, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోనగిరి దేవయ్య, బోయినపల్లి ప్రసాదరావు, జిల్లా నాయకులు మహిపాల్ రెడ్డి రామక్రిష్ణ , దేవరకొండ శ్రీనివాస్, శ్రీనివాసరావు, తిరుమలరెడ్డి, గంగారెడ్డి, చంద్రశేఖర్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు..