దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి!

👉 ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మహా ధర్నాలో
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J SURENDER KUMAR,

తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానించిన
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేల నాయకత్వంలో ఢిల్లీలో జరుగుతున్న ధర్నా, ఆందోళనలతో దక్కుతాయని నాకు సంపూర్ణ విశ్వాసం ఉందని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అన్నారు.


👉 బుధవారం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళన కార్యక్రమంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడారు...

రాహుల్ గాంధీ భారత్ జూడో కార్యక్రమంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీర్మానం చేసి ఆర్డినెన్స్ జారీ కోసం  గవర్నర్ కు పంపిన అంశం ను మంత్రి పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ అమలు పోరాటంలో సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉండాల్సిన అవసరాన్ని మంత్రి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.

ధర్నాలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తో రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ , పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , దామోదర రాజనర్సింహ , దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు , జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ , పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, సలహాదారులు, మహమ్మద్ షబ్బీర్ అలీ, కేశవరావు, మాజీ రాజ్యసభ సభ్యులు, వి. హనుమంతరావు, మాజీ ఎంపీ మధు యాష్కి వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, రామగుండం ఎమ్మెల్యే పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజ్ ఠాగూర్ మక్కాన్సింగ్,  ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, బీసీ సంఘాల ప్రతినిధులు పెద్దఎత్తున పాల్గొన్నారు.