దంపతుల హత్య కేసులో సిబిఐ రంగప్రవేశంతో ఉక్కిరి బిక్కిరి !

👉సుప్రీం కోర్టు ఆదేశాలతో సిబిఐ విచారణ ఎలా ఉంటుందో ? చార్జిషీట్ సమర్పించిన అధికారులలో ఆందోళన !

👉 న్యాయవాద దంపతులను హత్య చేయడానికి ఫిబ్రవరి 17 ఎందుకు ? ఎంచుకున్నారు

👉 సుప్రీంకోర్టులో 751 పేజీల పిటిషన్ దాఖలు చేసిన హతుడు తండ్రి కిషన్ రావు !

J SURENDER KUMAR,

పెద్దపల్లి జిల్లాలో హత్యకు గురైన న్యాయవాద దంపతుల హత్య కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు మంగళవారం కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)కి బదిలీ చేయడంతో విచారణ అధికారులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు సమాచారం .

తన కుమారుడు గట్టు వామన్ రావు, కోడలు పివి నాగమణి హత్యపై సిబిఐ దర్యాప్తు కోరుతూ గట్టు కిషన్ రావు సుప్రీంకోర్టు లో 751 పేజీల పిటిషన్ దాఖలు చేశారు.

👉 సిబిఐ విచారణ తీరు తెన్నులు ఇలా ఉండవచ్చు అని సీనియర్ న్యాయవాది అంచనా !

👉 సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సిబిఐ డైరెక్టర్ విచారణకు ప్రత్యేక అధికారుల బృందాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు.
హత్య కేసును విచారించి న్యాయస్థానంలో చార్జిషీట్ సమర్పించిన ఐఓ ( ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ) నివేదికను సిబిఐ అధికారుల బృందం క్షుణ్ణంగా అధ్యయనం చేస్తుందన్నారు. న్యాయస్థానంకు సమర్పించిన ఛార్జిషీట్లో లాకోస్ ( లాప్సస్ ) పరిశీలించి విచారణ చేపడుతుంది కాబోలు అన్నారు.

👉 ప్రత్యేకంగా సీన్ ఆఫ్  అఫెన్స్ ఎవిడెన్స్, ఫోటోలు వీడియో గ్రాఫ్స్, సంఘటనా స్థలంలో ఇరువైపులా నిలిచిపోయిన వాహనాలు, ఆర్టీసీ బస్సు డ్రైవర్ కండక్టర్ల , ప్రయాణికుల సాక్ష్యాలు, సోషల్ మీడియాలో  పోస్ట్ చేసిన ఫోన్ సాంకేతిక వివరాలను పరిగణంలోకి తీసుకుంటారు కాబోలు అన్నారు.

👉 దాదాపు నెల రోజులకు పైగా సెల్ ఫోన్ ల కాల్ డేటా, ఆయా ప్రాంతాలలో సెంటవర్ ల నుంచి   అవుట్ గోయింగ్ , ఇన్ కమింగ్, అనుమానిత ఫోన్ డాటా, వివరాలు, రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో  పోలీస్ అధికారుల బదిలీలు, నిబంధనల మేరకు జరిగాయా ?  రాజకీయ పోద్బలంతో జరిగాయా ?

👉 న్యాయవాద దంపతులను హత్య చేసే అంతటి పగ, ప్రతికారం, పోలీసు అరెస్టు చేసిన అనుమానితులకు ఉన్నాయా ? వాటికి గల కారణాలను సిబిఐ అధికారుల బృందం పరిగణంలోకి తీసుకోవచ్చు అని అన్నారు.

👉 హత్య సంఘటనలో విచారణ నిమిత్తం ఎంతమందిని అదుపులో తీసుకున్నారు ? వారి నుంచి ఎలాంటి సమాచారం సేకరించారు ?  ఎంత మందిని అరెస్టు చేశారు ? ఎంతమందిని విడిచి పెట్టారు ? వారి వాంగ్మూలం ఏమిటి ? తదితర అంశాలు పరిగణంలోకి తీసుకోవచ్చని న్యాయవాది తెలిపారు.

👉 సిబిఐ అధికారుల బృందానికి అనుమానం వచ్చిన ప్రతి అంశమును క్షుణ్ణంగా పరిశీలించి ఇన్వెస్టిగేషన్ అధికారులకు నోటీసులు ఇచ్చి వివరాలు సేకరించవచ్చున్నారు.

👉 హతుడు వామన్ రావు చివరి క్షణంలో మాట్లాడిన మాటలు,  (వీడియో రికార్డులో ఉన్నవి) విచారణ అధికారులు పరిగణంలోకి తీసుకున్నారా ? లేదా ? అనే అంశం కీలకం అని న్యాయవాది అభిప్రాయపడ్డారు.

👉 అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టినరోజు ఫిబ్రవరి 17 న న్యాయవాద దంపతుల హత్యకు పథకం రచనకు కారణం ?  అనే అంశం సైతం  సిబిఐ విచారణలో కీలకం కావచ్చు అనే అభిప్రాయం న్యాయవాది వ్యక్తం చేశారు.

👉 నిందితుల గత నేర చరిత్ర, సూత్రధారులు పాత్రధారులు కుట్రదారులతో సంబంధాలు, రాజకీయ పార్టీ తో సంబంధాలు  తదితర అంశాలతో పాటు, తమదైన శైలిలో సిబిఐ బృందాలు వివిధ కోణాలలో  హత్యకు సంబంధించిన అంశాలు విచారణ చేపట్టే అవకాశం ఉందని  న్యాయవాది అభిప్రాయపడ్డారు.

👉 గట్టు వామన్ రావు కేసు ఏమిటి ?

👉 మంథనిలోని కోర్టు కేసుకు హాజరైన తర్వాత దంపతులు హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా, దుండగులు వారి కారును అడ్డగించారు. కొడవళ్లు మరియు ఇతర పదునైన ఆయుధాలతో సాయుధులైన దాడి చేసిన దుండగులు, ఆ జంటను కారులోంచి బయటకు లాగి, ప్రజల సమక్షంలో నరికి చంపారు.

👉 దారుణమైన దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించాయి.
గట్టు వామన్ రావు మరణ ప్రకటనలో, అప్పటి అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పార్టీ (ఇప్పుడు భారత రాష్ట్ర సమితి లేదా BRS) స్థానిక నాయకుడు కుంట శ్రీనివాస్ ఈ దాడికి బాధ్యుడని పోలీసులు పేర్కొన్నారు.

👉 హత్య తర్వాత, పోలీసులు కుంట శ్రీనివాస్ మరియు అతని సహచరులతో సహా అనేక మంది వ్యక్తులను అరెస్టు చేశారు. వామన్ రావు మరియు శ్రీనివాస్ మధ్య వారి స్వగ్రామంలో ఒక భూమి సమస్య మరియు ఆలయ నిర్మాణంపై వ్యక్తిగత వివాదమే ఈ హత్యకు కారణమని పోలీసులు తెలిపారు.

👉 ఆ జంట కుటుంబం మరియు అనేక మంది ఇతరులు రాజకీయ ఉద్దేశ్యంతో ఈ హత్యలు జరిగాయని ఆరోపించారు, ప్రభావవంతమైన రాజకీయ వ్యక్తులపై ఆ జంట చట్టపరమైన కార్యకలాపాల ఫలితమే ఈ హత్యలు అని పేర్కొన్నారు.

👉 వామన్ రావు మరియు నాగమణి వివిధ ప్రజా సమస్యలపై అనేక ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిఐఎల్‌లు) దాఖలు చేశారు, వాటిలో స్థానిక పోలీస్ స్టేషన్‌లో జరిగిన కస్టడీ మరణానికి సంబంధించిన కేసు కూడా ఉంది. తమ ప్రాణాలకు ముప్పు ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

👉 రాజకీయ ఆరోపణలు మరియు పరిణామాలు: మాజీ టిఆర్ఎస్ ఎమ్మెల్యే మరియు పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ దగ్గరి బంధువు ప్రమేయంతో ఈ కేసు రాజకీయ కోణాన్ని తీసుకుంది.
హత్యకు ఉపయోగించిన కారు మరియు ఆయుధాలను అందించడంలో ఈ వ్యక్తి ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, పోలీసులు మరియు రాష్ట్ర ప్రభుత్వం నిజమైన దోషులను రక్షించడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించింది 

👉 కేంద్ర సంస్థ ద్వారా సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసింది. తెలంగాణ హైకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించి, సరైన మరియు వేగవంతమైన దర్యాప్తు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

👉 ఆగస్టు 2025లో, భారత సుప్రీంకోర్టు హత్యల దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కి బదిలీ చేసింది, ఈ విషయంలో మరింత దర్యాప్తు అవసరమని పేర్కొంది. CBI విచారణ కోరుతూ నిరంతరం ప్రయత్నిస్తున్న గట్టు వామన్ రావు తండ్రి చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం వచ్చింది.

👉 మాజీ ప్రభుత్వ అధికారుల ప్రమేయం ఉందని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు !

గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్వాగతించారు.
నేరస్థులు మరియు ‘వారికి మద్దతు ఇచ్చిన అప్పటి ప్రభుత్వ సీనియర్ నాయకులను  శిక్షించినప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుందని శ్రీధర్ బాబు అన్నారు.

నిష్పాక్షిక విచారణ జరపడానికి బదులుగా, గత ప్రభుత్వం నిజమైన నేరస్థులను రక్షించిందని మంత్రి ఆరోపించారు. కేసును సీబీఐకి బదిలీ చేయాలని పౌర సమాజ సంస్థలు మరియు కాంగ్రెస్ పార్టీ పదే పదే చేసిన విజ్ఞప్తిని గత ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు