J.SURENDER KUMAR,
ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో సోమవారం ఉదయం భక్తుడికి విద్యుత్ షాక్ తగిలింది, భక్తుడు ఎలాంటి గాయాలు లేకుండా క్షేమంగా ఉన్నాడు.
వివరాల్లోకి వెళితే..
పవిత్ర శ్రావణ మాసం చివరి సోమవారం సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని, భక్తులకు స్వచ్ఛందంగా సేవలు అందించడానికి వరంగల్ జిల్లాకు చెందిన భక్తుడు వచ్చాడు.
ఆలయ ప్రాంగణంలో నిత్య ఉచిత అన్నదాన భోజనశాలకు భక్తులు వెళ్లే కారిడార్ లో ఈ సంఘటన జరిగింది.

కిచెన్ లో మరమ్మతుల కోసం టెక్నీషియన్లు తాత్కాలికంగా విద్యుత్తు వైర్లతో పని ప్రాంతంలో వెల్డింగ్ పనులు చేస్తున్నట్టు సమాచారం. రెండు వైర్లు జాయింట్ చేసిన ప్రాంతంలో ప్లాస్టిక్ టేపు అంటించక నిర్లక్ష్యం గా పనులు చేసినట్టు సమాచారం.
మధ్యాహ్నం ఉచిత అన్నదానం కోసం వందలాది మంది భక్తులు సంఘటన జరిగిన కారిడార్ నుండి భోజనానికి లోనికి వెళ్తారు. మధ్యాహ్నం విద్యుత్ ప్రమాదం జరిగితే పరిస్థితి ఏమిటి అనే చర్చ జరుగుతున్నది.
ఆలయాధికారులు స్పందించి ఆలయ ప్రాంగణంలో విద్యుత్ సరఫరా తీగలను పరిశీలించి ప్రమాద భరితమైన తీగలను మార్చవలసింది భక్తజనం కోరుతున్నారు.