ధర్మపురి అసెంబ్లీ లో డిగ్రీ, పీజీ, లా, బి ఫార్మసీ కళాశాలలు!


👉 వెల్గటూర్ మండలంలో స్థల పరిశీలన !


👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

జగిత్యాల జిల్లాలోని మారుమూల గ్రామీణ విద్యార్థులకు ఉన్నత విద్యా ఆకాశాలు అందుబాటులోకి తేవడానికి ధర్మపురి అసెంబ్లీ పరిధిలోని వెలగటూరు మండలంలో డిగ్రీ, పీజీ, లా, బి ఫార్మసీ కళాశాలలో ఏర్పాటుకు ప్రణాళిక  సిద్ధం చేసినట్టు మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి అలుగు వర్షిని మంత్రి లక్ష్మణ్ కుమార్ తో కలిసి శుక్రవారం వెలగటూరు మండలంలో స్థల పరిశీలన చేశారు.

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మ ణ్ కుమార్ మాట్లాడుతూ..

జగిత్యాల జిల్లాకు చెందిన విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఇతర పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, జిల్లాలోనే సమగ్ర సదుపాయాలు కలిగిన విద్యా కేంద్రాన్ని అభివృద్ధి చేయాలి అని
ప్రభుత్వం భారీ ప్రణాళికలు రూపొందిస్తోంది అని మంత్రి అన్నారు.

👉 ప్రభుత్వ లక్ష్యం దాదాపు ₹ 200 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  దృష్టికి తీసుకెళ్లి త్వరలో పనులు ప్రారంభిస్తాం అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.

👉 వెల్గటూర్ మండలంలోని స్తంభంపల్లి, పాసిగాం గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూ స్థలాలను పరిశీలించామని మంత్రి అన్నారు.


👉 విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకుండా కళాశాలలు ఏర్పాటు చేసి, విద్యార్థులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించే ప్రణాళిక ఉందని మంత్రి తెలిపారు. దీంతోపాటు  సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్స్ కూడా ఏర్పాటు చేసి, బాలురు,  బాలికలు నాణ్యమైన విద్యను అందించేలా  చర్యలు తీసుకుంటామని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.