ధర్మపురి లో బ్యాంక్ కు బురిడీ నకిలీ బంగారంతో రుణం ?

J.SURENDER KUMAR,

సమాజ మనుగడకు ఆర్థిక చేయూత అందిస్తున్న జాతీయ, గ్రామీణ బ్యాంకుల సేవలు సదా అభినందనీయమే. రిజర్వు బ్యాంకు నిబంధనల మేరకు కొనసాగే ధర్మపురి పట్టణంలోని ఓ బ్యాంక్ కు గతంలో బురిడీ కొట్టించి నకిలీ బంగారంతో రుణం పొందిన సంఘటన గూర్చి బ్యాంకింగ్ ఆడిట్ అధికార వర్గాలు  చర్చించుకుంటున్నట్టు తెలిసింది.

👉వివరాల్లోకి వెళితే..


మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – 2  బ్రాంచిలో గత నాలుగు రోజుల క్రితం భారీ కుంభకోణంవెలుగు చూసిన విషయం తెలిసిందే. బ్యాంక్ లో తనిఖీ అధికారులు లెక్కలు తీస్తున్న క్రమంలో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్టు చర్చ. ఈ నేపథ్యంలో ఆయా బ్యాంక్ లలో గతంలో జరిగిన నిధుల గోలుమాలు పై బ్యాంక్ తనిఖీ  అధికారులలో నెలకొన్న చర్చలలో ధర్మపురి లోని ఓ బ్యాంక్  లో నకిలీ బంగారం కుదువ పెట్టి రుణం పొందిన  ఉదంతం పై చర్చ జరిగినట్టు సమాచారం.

ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురిలో రెండు జాతీయ బ్యాంకులు,  సహకార,  గ్రామీణ, అర్బన్ బ్యాంకులు వినియోగదారులకు సేవలందిస్తున్నాయి. ఇండ్ల, వ్యాపార సముదాయాలు, ఇతర నిర్మాణాలకు, వ్యాపారాలకు, వాహనాల కొనుగోలుకు, విద్య, వ్యక్తిగత అవసరాలకు ఆస్తులు తాకట్టు పెట్టుకొని, ప్రభుత్వ ఉద్యోగుల స్యూరిటీలతో రుణాలు తక్కువ వడ్డీతో ఇస్తున్న విషయం తెలిసిందే. ఎలాంటి ఆస్తిపాస్తులు అందుబాటులో లేక, అవసరం నిమిత్తం బంగారు ఆభరణాలు సైతం తాకట్టు పెట్టుకొని బ్యాంకులు వినియోగదారులకు రుణాలు ఇస్తుంటాయి.

👉 బంగారంపై తక్కువ వడ్డీ…

బ్యాంక్ లో బంగారు ఆభరణాలపై రుణం తీసుకున్నవారు, లక్ష రూపాయలకు సంవత్సరానికి ₹ 9 వేలు ఎనిమిది వందల రూపాయలు మాత్రమే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ప్రైవేట్ ఫైనాన్సులలో లక్ష రూపాయలకు సంవత్సరానికి ₹ 24 వేలు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

అత్యవసర డబ్బుల అవసరాల నిమిత్తం వినియోగదారులు బంగారు ఆభరణాలు కుదువ పెట్టుకుంటారు. బంగారం నాణ్యత ప్రమాణాలు గుర్తించే నైపుణ్యం, నిర్వహణ అధికారులకు అవగాహన లేకపోవడంతో,  రిజర్వ్ బ్యాంక్  నిబంధనల మేరకు గోల్డ్ అప్రైజర్ ను (బంగారం నాణ్యతను గుర్తించే ప్రైవేట్ వ్యక్తి) ఆయా బ్యాంక్ లు నియమించుకుంటాయి.

ఈ నియామకంకు రాత పరీక్ష , స్కిల్ టెస్ట్,  బంగారు వ్యాపారం నిర్వహణ తదితర అంశాలు పరిగణంలోకి తీసుకొని స్థానిక బ్యాంక్ అధికారులు అప్రైజర్ ను నియమించుకుంటారు.

వీరికి బంగారం పై లక్ష రూపాయల రుణం  పొందిన సందర్భంలో  ₹ 400/- ( నాలుగు వందలు)  సర్వీస్ ఛార్జీల కింద చెల్లిస్తారు. లక్షల రూపాయలు దాటి ఎంత మొత్తం రుణమైన ₹ 500/- (ఐదు వందలు) చెల్లిస్తారు.

👉 ఆడిట్ లో వెలుగు చూసిందా ?

ఆయా బ్యాంక్ లలో రుణాల కోసం కుదువ పెట్టిన బంగారు ఆభరణాల తనిఖీలు బ్యాంక్ ల నిర్వహణ ప్రక్రియలో భాగంగా జరుగుతుంటాయి. అయితే ఇతర ప్రాంతాలకు చెందిన బ్యాంక్ ప్రత్యేక అధికారి తో పాటు, ఇతర ప్రాంతాలకు చెందిన గోల్డ్ అప్రైజర్ (బంగారం నాణ్యత ప్రమాణాలు పరిశీలించే ప్రైవేటు వ్యక్తి)  తనిఖీలలో పాల్గొని బ్యాంక్ మేనేజర్ల సమక్షంలో కుదువ పెట్టిన బంగారు ఆభరణాలు తనిఖీ చేసి నివేదిక ఇస్తారు.

ఈ నేపథ్యంలో  ధర్మపురి లోని ఓ జాతీయ బ్యాంక్ లో కుదువ పెట్టిన బంగారం నకిలీది అని నిర్ధారించి నివేదిక ఇచ్చినట్టు చర్చ. ఈ నేపథ్యంలో తనిఖీకి చేపట్టిన అధికారి బ్యాంకింగ్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. అయితే ఇందులో బ్యాంక్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న కీలక అధికారి గత ట్రాక్ రికార్డు నియమ నిబంధనలు, సమయపాలన పాటించడంలో ఎలాంటి ఆరోపణలు లేకపోవడంతో. ఆడిటింగ్ అధికారులు గోల్డ్ అప్రైజర్ పై దృష్టి సారించినట్టు సమాచారం.

రిజర్వ్ బ్యాంక్ నిబంధనల మేరకు తక్షణ చర్యలు తీసుకోకుండా ఆచితూచి తమదైన శైలిలో గోల్డ్ అప్రైజర్ కార్యకలాపాలపై నిఘా పెట్టి నిలదీసినట్టు సమాచారం. తన దగ్గర వ్యక్తి , అత్యవసరంగా డబ్బులు అవసరం ఉన్నాయని పరుగున రావడంతో నా తొందరపాటుతో, పొరపాటు జరిగింది. అంటూ గోల్డ్ అప్రైజర్ బ్యాంక్ అధికారులను ప్రాధేయపడి నకిలీ బంగారం పై రుణం పొందిన వినియోదారుడితో డబ్బులు తిరిగి బ్యాంక్ కు చెల్లించి కుదువ నకిలీ బంగారం తీసుకున్నట్టు చర్చ.


ఈ సంఘటన గత కొన్ని సంవత్సరల క్రితం జరిగిందా ? ఇటీవల జరిగిందా ? అనే అంశంలో స్పష్టత లేదు. నకిలీ బంగారు ఆభరణంతో రుణం పొందినది వాస్తవమే కావచ్చు అనే చర్చ బ్యాంక్ అధికారులో జరిగింది. నేపథ్యంలో ఉత్తర తెలంగాణ జిల్లాలలో కొన్ని బ్యాంక్ లలో కుదువ ఉన్న బంగారు ఆభరణాలను తరచు నిబంధనల మేరకు తనిఖీలతో పాటు రుణాలు పొందిన వారి వివరాలు సేకరిస్తున్నట్టు చర్చ.