J.SURENDER KUMAR,
ధర్మపురి పట్టణంలోని కోర్టు విధులను న్యాయవాదులు మంగళవారం బహిష్కరించి నిరసన తెలిపారు.
ధర్మపురి బార్ అసోసియేషన్ అధ్యక్షులు అలుక వినోద్ కుమార్, మాట్లాడుతూ.. కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు, ఆసిఫాబాద్ కోర్టులో చీప్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ గా విధులు నిర్వహిస్తున్న
పి.నరహరి పైన జరిగినటువంటి దాడిని ఖండిస్తూ , ధర్మపురి కోర్టు విధులు బహిష్కరించినట్టు తెలిపారు.
అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే అమలు చేయాలని, మరియు అడ్వకేట్ నరహరి పైన దాడి చేసిన వ్యక్తులపై హత్య ప్రయత్నం కేసు పెట్టి నిందితులని న్యాయమూర్తికి వినతిపత్రం ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మామిడాల శ్రీకాంత్ కుమార్, మరియు రౌతు రాజేష్, అప్పల నిరంజన్, ఏజిపి ఇమ్మడి శ్రీనివాస్, బందెల రమేష్ , రామడుగు రాజేష్, కస్తూరి శరత్ ,సుంకే రాజు, కలమడుగు కీర్తి తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.