👉🏻 ధర్మపురిలో మంత్రి లక్ష్మణ్ కుమార్ పర్యటన !
J.SURENDER KUMAR,
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మపురి పట్టణంలో నెలకొన్న సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు.
పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు కాశెట్టి వాడలో అకాల వర్షాల కారణంగా గురువారం ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం పర్యటించారు.

👉 ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ స్థానిక ప్రజలతో మాట్లాడారు.
అనంతరం అధికారులతో పరిస్థితిని సమీక్షించిన మంత్రి, ధర్మపురి పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థను బలోపేతం చేయడం, సీసీ రోడ్ల నిర్మాణం, నీటి నిల్వలు, మురికి నీరు గోదావరిలో కలిసే సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.

ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్ యంత్రాంగం ముందుగానే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.