ధర్మపురి పోలీసులు @ ప్రజా సేవకులు !

J SURENDER KUMAR,

శాంతి భద్రతల పరిరక్షణ, పర్యవేక్షణలో నిత్యం బిజీ బిజీగా విధులు నిర్వహించే పోలీసులు, కొన్ని సందర్భాలలో పొంచి ఉన్న  ప్రమాదాల భారీ నుండి ప్రజలను కాపాడుతున్న సందర్భాలు అనేకం, ఈ నేపథ్యంలో  ధర్మపురి గోదావరి నది లో నీటి ప్రవాహం పెరగడంతో  స్నానాలు చేస్తున్న యాత్రికులను ధర్మపురి పోలీసులు  సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

పుణ్యక్షేత్రమైన ధర్మపురి గోదావరి నదిలో నిత్యం యాత్రికులు భారీ సంఖ్యలో పవిత్ర స్నానాలు చేస్తుంటారు.  బుధవారం ఉదయం కొందరు యాత్రికులు, పిల్లాపాపలతో స్నానాలు చేస్తున్నారు.  నీటిమట్టం పెరగడంతో ఒడ్డుకు రావడానికి ప్రయత్నించారు. మరో నీటిపాయ ప్రవాహం ఉదృతం ఉధృతంగా ఒకేసారి ప్రవాహం మొదలైంది.

పెట్రోలింగ్ నిర్వహిస్తున్న స్థానిక ఎస్సై ఉదయ్ కుమార్, సిబ్బంది  నదిలో యాత్రికులను గుర్తించి వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

👉 కడెం ప్రాజెక్ట్ నీటి విడుదలతో పెట్రోలింగ్ !

కడెం ప్రాజెక్టు లో నీటిమట్టం పూర్తిగా నిండడంతో బుధవారం తెల్లవారుజామున ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని గోదావరిలోకి వదిలారు.  గోదావరి పరివాహక ప్రాంతంలో ( క్యాచ్మెంట్)  నదీ పరివాహక ప్రాంతం లోకి  పశువులు , గొర్రెలు,  గొర్రె కాపరులు  రైతులు నది పరిసరాలకు వెళ్లవద్దని , కడెం ప్రాజెక్టు 4  విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాథోడ్ విట్టల్. ముందస్తుగా ప్రచార సాధనాల్లో ప్రకటన జారీ చేశారు. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులు గోదావరి నది తీరంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా యాత్రికులు చిక్కుకున్న దృశ్యం చూసి వారిని సురక్షితంగా ఒడ్డుకు  చేర్చారు.