ధర్మపురి ప్రజలను హైరానా పెట్టింది చిరుత కాదు హైనా !

👉 జిల్లా అటవీశాఖాధికారి మాదాసు రవి ప్రసాద్ !

J.SURENDER KUMAR,

ఈనెల 9 న ధర్మపురి శివారు పోచం పంపు,  ప్రాంతంలో సంచరించింది చిరుత పులి కాదు అని
హైనా అనే జంతువు అని జగిత్యాల జిల్లా అటవీశాఖ అధికారి మాదాసు రవి ప్రసాద్ తెలిపారు.

చిరుత సంచరిస్తుందని హైరానా పడి గ్రామస్తులు తెలుపగా అక్కడికి వెళ్ళవల్సిందిగా ధర్మపురి అటవీశాఖ  సిబ్బందిని ఆదేశించినట్టు పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.

👉 జిల్లా అటవీశాఖ అధికారి పత్రికా ప్రకటన


అటవీశాఖ సిబ్బంది వెళ్ళి చుట్టుపక్కల ప్రాంతాన్ని మొత్తం పరిశీలించగ అక్కడ అటవీ జంతువుకు సంబందించిన కొన్ని పాదముద్రల ను గుర్తించారు. ఆ పాద ముద్రల ఫోటోస్ ను సేకరించి వాటిని వైల్డ్ లైఫ్ నిపుణులకు పంపించినట్టు పేర్కొన్నారు.

వైల్డ్ లైఫ్ నిపుణులతో విచారించి ఆ పాదముద్రలు చిరుత పులివి కావని, హైనా అనే జంతువుకు సంబందిచినవని నిర్ధారించినట్టు ప్రకటనలో పేర్కొన్నారు.

👉మీడియా సమావేశంలో మాట్లాడుతున్న అటవీశాఖ అధికారులు !


సోమవారం ఉదయం తాను, అటవీ క్షేత్రాధికారి, ధర్మపురి మరియు రేంజ్ సిబ్బందితో కలసి సంఘటన స్థలాన్ని పరిశీలించినట్టు పేర్కొన్నారు. ప్రజలను భయ బ్రాంతులకు గురి కావద్దని, యధావిదిగా వారి పనులను చేసుకోవచ్చని,
మేకల మరియు గొర్ల కాపరులను అప్రమత్తంగా వుండవలసినదిగా, సాయంత్రం లోపల పొలం పనులను ముగించుకోవాలని మరియు రక్షణ నిమిత్తం గుంపులుగా వెళ్లాల్సిందిగా ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.