👉 శనివారం చిరుత సంచారం తెలిసిన పట్టించుకోని అటవీశాఖ !
👉 ధ్రువీకరించిన అటవీశాఖ యంత్రాంగం !
👉 చిరుత అడుగులు గుర్తింపు !
👉” ఉప్పు” లో ప్రచురితం – స్పందించిన అటవీశాఖ యంత్రాంగం !1
J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ శివారులో చిరుత పులి సంచారం వాస్తవమేనని అటవీశాఖ అధికారులు ఆదివారం ధ్రువీకరించారు. వ్యవసాయ కూలీలు ఇతరులకు చిరుత పులి అగుపించడం, వ్యవసాయ భూములలో సంచారం, గూర్చి తమ శాఖకు శనివారం సమాచారం ఇచ్చారు అని స్పష్టం చేశారు.

👉 ప్రజలు అప్రమత్తంగా ఉండాలి !

నాగారం, కమలాపూర్, రామయ్య పల్లె, ధర్మపురి ప్రాంత ప్రజలు గుంపులు, గుంపులుగా వ్యవసాయ పనులు, ఇతర పనులకు వెళ్లాలని అటవీశాఖ విజ్ఞప్తి చేసింది. ఒకవేళ చిరుత పులి కనిపించిన దానిపై దాడి చేయవద్దని అటవీశాఖ సిబ్బంది విజ్ఞప్తి చేశారు. కమలాపూర్ , శివారు నాగారం, ఆకుసాయి పల్లె, నేరెళ్ల గుట్టల ప్రాంతాల నుంచి చిరుత పులి వచ్చినట్టు వ్యవసాయ కూలీలలో చర్చ.

👉 అటవీశాఖ నిర్లక్ష్య వైఖరి !
ధర్మపురి పట్టణంలో అటవీ శాఖ రేంజ్ కార్యాలయం ఉంది. రేంజ్ అధికారితోపాటు, సెక్షన్ అధికారి,బీట్ అధికారి, వాచర్లు ఉంటారు. ధర్మపురి శివారు కమలాపూర్ దారిలో పెట్రోల్ పంపు పక్క నుంచి ఎడ్లబండ్ల దారి గుండా నిత్యం వ్యవసాయ భూములలో రైతులు, కూలీలకు చిరుత అగుపించిన సమాచారం శనివారం పగలు అటవీ శాఖ కు సమాచారం తెలిసిన అటవీ శాఖ వారు నిర్లక్ష్యం వహించారు.

ముందస్తుగా ఈ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయలేదు.” ఉప్పు ” లో చిరుత పులి సంచారం వార్త ప్రచురితం కావడంతో ఆ శాఖ సిబ్బంది హడావిడి చేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. వాహనంకు మైకు ద్వారా కమలాపూర్, నాగారం, రామయ్య పల్లె, ధర్మపురి శివారు ప్రాంతాల్లో చిరుత పులి సంచారం గూర్చి ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది.

ఈ గ్రామాలకు ఆర్టీసీ సౌకర్యం లేకపోవడంతో అత్యధిక శాతం మంది కాలినడకన, ద్విచక్ర వాహనాలు, ఆటోల గుండా రాకపోకలు కొనసాగిస్తారు. రేపు శ్రావణ సోమవారం నేపథ్యంలో ఇక్కడ పురాతన శ్రీ అక్క పెళ్లి రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తజనం భారీ సంఖ్యలో ఈ దారి గుండా నే కాలినడకన వెళ్లి దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో గ్రామాలలో చాటుంపు వేయాల్సిన అవసరం ఉంది.