ధర్మపురి తీరంలో ఉదృతంగా ప్రవహిస్తున్న గోదావరి !

👉 బుధవారం అర్ధరాత్రి నుంచి  పహారా !


J.SURENDER KUMAR,


ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు, కడెం, ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుండి నీటిని గోదావరి నదిలోకి వదలడంతో ధర్మపురి తీరంలో నది ఉదృతంగా ప్రవహిస్తూ సంతోషిమాత ఆలయం దాటి పాత సంస్కృత పాఠశాల దరిదాపుల్లోకి నది ప్రవాహం చేరుకుంది.

వర్షాలు, కడెం, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, నిండి నీరు గోదావరి నదిలోకి విడుదల చేస్తే నదీ ప్రవాహం ధర్మపురి పట్టణంలోకి రానున్నది. వరద పరిస్థితిని అంచనా వేస్తూ రెవెన్యూ పోలీస్ యంత్రాంగం నది తీరంలో కొబ్బరికాయలు, పూజా సామాగ్రి, హోటల్స్ చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

స్థానిక సీఐ, ఎస్ఐ, రామ్ నరసింహారెడ్డి, ఉదయకుమార్, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ, స్థానిక మున్సిపల్ బుధవారం అర్ధరాత్రి నుంచి గోదారి నది వద్ద పాహారా కాస్తున్నారు.


గురువారం ఋషి పంచమి పర్వదినం కావడం గోదావరి నదిలో భక్తులు పవిత్ర స్థానాలు చేయడానికి వచ్చే భక్తజనం నియంత్రణకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది.