J.SURENDER KUMAR,
దివ్యాంగులకు మరియు అవసరమైన ప్రజలకు వైద్య, ఆరోగ్య సేవలు చేరువ కావడానికి ఇలాంటి క్యాంపులు ఎంతో అవసరమని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనారిటీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి
అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
డిజేబుల్ ఫౌండేషన్ ట్రస్ట్, మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో, పిట్టి ట్రస్ట్ సహకారంతో, మెగా మెడికల్ మరియు హెల్త్ క్యాంప్ ను సోమవారం తెలంగాణ రాజ్‌భవన్ ప్రాంగణంలోని సంస్కృతిక కళాభవనంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ ,మరియు సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
జ్యోతి వెలిగించి మంత్రి మెడికల్ క్యాంప్ ను ప్రారంభించారు.
👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…..

సమాజంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సాహకర చర్యలు చేపడుతుందని తెలిపారు.
👉 ఈ కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ…..

సమాజంలోని బలహీన వర్గాలకు వైద్య సేవలు అందించడంలో స్వచ్ఛంద సంస్థల పాత్ర ప్రశంసనీయం అని అభినందించారు.
ఈ వైద్య శిబిరంలో వైద్య నిపుణులు, స్వచ్ఛంద సంస్థలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.