ఫ్లాష్.. ధర్మపురి శివారులో చిరుత పులి ?

J.SURENDER KUMAR,

జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ శివారులో

చిరుత పులి వ్యవసాయ కూలీలకు

అగుపించినట్టు సమాచారం.

👉 వివరాలు ఇలా ఉన్నాయి..

ధర్మపురి శివారు కమలాపూర్  దారిలో  పెట్రోల్ పంపు పక్క నుంచి ఎడ్లబండ్ల  దారి గుండా నిత్యం వ్యవసాయ భూములకు రైతులు, కూలీలు వెళ్తుంటారు.  శనివారం పగలు ఆ ప్రాంతంలోని వ్యవసాయ భూములలో పనిచేస్తున్న కొందరు కూలీలకు  చిరుత పులి ( చిన్న పిల్ల ) ఆగుపించడం తో భయంతో వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చినట్టు తెలిసింది.

చిరుత పులి సమాచారం భూమి యజమానికి కూలి చెప్పడంతో అతడు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. అయితే చిరుత పులి సంచారం పై  స్థానిక అటవీ శాఖ అధికారులను ఫోన్ సంప్రదించడానికి ప్రయత్నించిన వారు స్పందించలేదు. ధర్మపురి కమలాపూర్ దారిలో  నిత్యం పదుల సంఖ్యలో జనాలు మార్నింగ్ వాక్  చేస్తుంటారు. సంబంధిత శాఖ అధికారులు కూలీకు అగుపించింది చిరుత పులా ? మరి ఇతర  జంతువా ? నిర్ధారించి ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది.