👉 10 రోజులలో ముగియనున్న పదవి కాలం రిజిస్ట్రేషన్ కానీ 0-13 గుంటల భూమి !
👉 లక్షలాది రూపాయల రైతుల సొమ్ముతో ఎకరం కొనుగోలు చేసినట్టు రికార్డులో నమోదు !
👉 కేవలం 0-27 గుంటల భూమి రిజిస్ట్రేషన్. మరో 0-13 గుంటల భూమి ఎక్కడ ?
👉 పాలకవర్గం బాధ్యతలు చేపట్టిన 5 నెలలకే భూ కుంభకోణానికి రంగం సిద్ధం !
👉 విండో అక్రమాలకు అధికారులు అండదండలు ?
J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా ధర్మపురి సింగిల్ విండోలో భారీ భూ కుంభకోణం జరిగింది. లక్షలాది రూపాయల రైతుల సొమ్ముతో ధర్మపురి సింగిల్ విండో పాలకవర్గం నాగారం శివారులో సర్వేనెంబర్ 84 ‘ఈ’ లో ఎకరం భూమి కొనుగోలుకు డబ్బులు చెల్లించి, కేవలం 0-27 గుంటల భూమిని విండో పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
👉 విండో కు చెందాల్సిన మరో 0-13 గుంటల భూమి పాలకవర్గ సభ్యులు పంచుకోవడానికి గత ఐదు సంవత్సరాలుగా ధర్మపురి విండో పేరిట రిజిస్టర్ చేయించుకోవడం లేదు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

👉 ధర్మపురి విండో పాలకవర్గ పదవీకాలం ఈ సంవత్సరం ఫిబ్రవరి 15 కు ముగిసే నేపథ్యంలో ప్రభుత్వం వీరి పదవి కాలం ఆగస్టు 15 వరకు ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా పొడిగించింది.
మరో 10 రోజులలో వీరు పదవీకాలం ముగియనున్నది.
👉 ఐదు సంవత్సరాల క్రితమే కొనుగోలు !
ధర్మపురి మండలం నాగారం గ్రామ శివారులో సర్వేనెంబర్ 84 ఈ లో 0-27 గుంట ల భూమి నీ పట్టేదారు ఎడమల రాజేశ్వర్ రెడ్డి నుంచి ధర్మపురి సింగిల్ విండో పేరిట జగిత్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 2020, జూలై 6న డాక్యుమెంట్ నెంబర్ 4052/20, ద్వారా రిజిస్టర్ అయ్యింది.

👉 నాగారంలోని సర్వే నెంబర్ 84 EE లో భూమి మొత్తం విస్తీర్ణం 1-10 గా ఉంది. , అగ్రిమెంట్ లో ₹ 4- 26, 000/ అని డాక్యుమెంట్ లో ఉంది. 0-27 గుంటల భూమికి సొసైటీ వారు ₹ 1,02,000/ ( లక్ష రెండు వేలు ) చెల్లించినట్టుంది. సబ్ రిజిస్టర్ కు చాలాన్ ద్వారా.₹ 9,062-00, నాలా ( నాన్ అగ్రికల్చర్ ల్యాండ్. మోటివేషన్) ₹10,000/- సర్వేయర్ కు ₹ 6 , 500/- మొత్తం ఖర్చు ₹, 5,10,662/-( ఐదు లక్షల పది వేల 662/-) చెల్లించినట్లు విండో రికార్డులో నమోదు చేశారు.
👉 రైతులను మోసగించి సర్వసభ్య సమావేశంలో తీర్మానించి !
ధర్మపురి సొసైటీ అధ్యక్షుడు ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షతన 2021 మార్చ్ 26 న నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఎజెండా అంశం X లొ నాగారంలో ఒక ఏకరం భూమి కొనుగోలు గూర్చి ఏకగ్రీవంగా తీర్మానించినట్టు మినిట్స్ పుస్తకం పేజీ నెంబర్ 25 లో తీర్మానించారు.


( సమావేశం అనంతరం ఈ అంశం చివరగా నమోదు చేసి ఆమోదించినట్టు ఉంది ) మినిట్స్ బుక్ ను పరిశీలిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయి.
👉 భూ కుంభకోణం తీరు ఇలా..!

నాగారం శివారులోని భూమిని ధర్మపురి సొసైటీ పేరిట 2020 జూలై ,6 న రిజిస్టర్ అయ్యింది. సొసైటీ రైతుల సర్వసభ్య సమావేశం నిర్వహణకు దాదాపు 9 నెలలు ముందుగానే 0-27 గుంటల భూమి పాలకవర్గంకు రిజిస్ట్రేషన్ చేయించుకుంది.
👉 సొసైటీ సర్వసభ్య సమావేశం 2021, మార్చ్, 6న విండో అభివృద్ధి కోసం నాగారంలో భూమి కొనుగోలకు అంటూ చివరి ఏజెండాలో నమోదు చేసి అమాయక రైతులను మోసగించిన తీరుకు నిలువెత్తు నిదర్శనంగా రికార్డులలో నమోదయింది.
👉 జిల్లా అధికారి అనుమతి లేకుండానే కొనుగోలు !
జగిత్యాల్ జిల్లా సహకార శాఖ అధికారికి నాగారంలో ఎకరం భూమి కొనుగోలు అనుమతి కోసం సొసైటీ కార్యదర్శి 2020 జులై 6 న. లేఖ రాశారు.
👉 సహకార అధికారి, లేఖ సంఖ్య Rc.No.591/2020-C. ద్వారా తేదీ 2020 జూలై 13న. ఒక ఎకరం కొనుగోలుకు అనుమతి ఇస్తూ ₹.4 -26 లక్షలకు, ముగ్గురు మేనేజింగ్ కమిటీ సభ్యులను నియమించి భూమి కొనుగోలు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.

జిల్లా సహకార అధికారి అనుమతి లెక్కచేయకుండా వారం రోజులు ముందుగా భూమిని సొసైటీ అధ్యక్షుడు, రిజిస్టర్ చేయించుకున్నారు.
👉 బాధ్యతలు చేపట్టిన 5 నెలలకే భూమి కొనుగోలు !

విండో పాలకవర్గం పదవి బాధ్యతలు చేపట్టిన 5 నెలలకే భూమి కొనుగోలు పేరిట కుంభకోణానికి శ్రీకారం చుట్టినట్టు రికార్డులలో నమోదైన వివరాలు స్పష్టం చేస్తున్నాయి.
ఎకరం భూమి కొనుగోలుకు లక్షలాది రూపాయల సొసైటీ డబ్బులు చెల్లించి కేవలం 0-27 గుంటలు సొసైటీ పేరును రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
👉 5 సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం లేదు !

5 సంవత్సరాలుగా సొసైటీ కి చెందాల్సిన 0- 13 గుంటల భూమి కోసం పాలకవర్గం పట్టించుకోవడం లేదు, సొసైటీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకోవడం లేదు. ఈ 0-13 గుంటల భూమి ఎవరి ఆధీనంలో ఉందో ? ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం లేదో,? విచారణ జరిపితే భూమి కుంభకోణం విషయాలు వెలుగు చూస్తాయి.