ఫ్లాష్.. ధర్మపురి విండో భూ కుంభకోణంలో కొత్త కోణం !

👉 13 గుంటల భూమి స్వాహా కోసం పత్రం  రాయించుకున్నారు !

👉 అక్రమాలకు అధికారుల అండదండలు ?

J.SURENDER KUMAR,

జగిత్యాల జిల్లా ధర్మపురి సింగిల్ విండో 13 గుంటల  భూ కుంభకోణం లో  కొత్తకోణం వెలుగు చూసింది. విండోకు రిజిస్ట్రేషన్ కావలసిన 0 -13 గుంటల భూమిని స్వహ చేయడానికి స్టాంపు పేపర్ పై ఒప్పంద పత్రం  రాయించుకున్నారు, రేపో, మాపో,
0 -13 గుంటల భూమి పరాధీనం కానున్నది. 0-13 గుంటల భూమి పంపకాల పంచాయతీలో అవినీతి బాగోతం బయటపడింది
.

👉  వివరాలు ఇలా ఉన్నాయి..

లక్షలాది రూపాయల రైతుల సొమ్ముతో ధర్మపురి సింగిల్ విండో పాలకవర్గం నాగారం శివారులో సర్వేనెంబర్ 84 ‘ఈ’  లో ఎకరం భూమి కొనుగోలుకు డబ్బులు చెల్లించి, కేవలం 0-27 గుంటల భూమిని దాదాపు ఐదు సంవత్సరాల క్రితం విండో పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.

👉 విండో కు రిజిస్ట్రేషన్ కావలసిన  మరో  0-13 గుంటల భూమి పాలకవర్గ సభ్యులు పంచుకోవడానికి గత ఐదు సంవత్సరాలుగా ధర్మపురి విండో పేరిట రిజిస్టర్  చేయించుకోవడం లేదు అనే ఆరోపణలుకు  విండో పాలకవర్గం అవినీతి అక్రమాలకు స్టాంప్ పేపర్ పై  రాయించుకున్న ఒప్పంద పత్రము నిదర్శనంగా నిలిచింది.

👉 నాన్ జ్యుడీషియల్ స్టాంపు పేపర్ పై ఒప్పంద పత్రంలో …..

2020 జూలై 16 న పట్టేదారు ఎడమల రాజేశ్వర్ రెడ్డి
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ( ధర్మపురి సింగిల్ విండో )  అధ్యక్షుడికి వ్రాసి ఇచ్చిన ఒప్పంద నామ పత్రం లో  నాగారం శివారు లో సర్వే నెంబర్ 84 ఈ లోని 1- 00 ( అక్షరాలు ఒక ఎకరం భూమిలో పట్టా ఉండి 0- 27 గుంటల భూమికి  ధర చేసుకుని,₹3,95,500/- ( అక్షరాల మూడు లక్షల తొంబై ఒక్క వేయి ఐదు వందలు ,)  పట్టాలేని 0-13 ( పదమూడు గుంటల భూమికి సగం ధర చొప్పున, మొత్తం 0-13 గుంటల కు ₹ 93,600/- ( తొంబై మూడు వేల ఆరు వందలు ) తీసుకుని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కు అమ్మితిని. 

ఇట్టి భూమికి నాలుగు దిశలు గల రైతులు ఎవరు ఎటువంటి కాగితాలు తీసుకుని వచ్చిన పూర్తి బాధ్యత మాదే, మీరు ఇచ్చినటువంటి డబ్బులకు రెట్టింపు డబ్బులు చెల్లించడం ఖరారు ఇది మా ఇష్టపూర్వకంగా వ్రాసి ఇస్తున్న  ఒప్పంద పత్రం సహీ అని పేర్కొన్నారు. అయితే సంతకం ఏడమల రాజేశ్వర్ రెడ్డి , కాకుండా ఇతరులు చేశారు.

☝️ధర్మపురి సింగిల్ విండోకు పట్టే దారు నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ పై వ్రాయించి ఇచ్చిన ఒప్పంద పత్రం !

👉  కొత్తకోణం..

ధర్మపురి మండలం నాగారం గ్రామ శివారులో సర్వేనెంబర్  84 ఈ లో 0-27 గుంట ల భూమి నీ పట్టేదారు ఎడమల రాజేశ్వర్ రెడ్డి నుంచి ధర్మపురి సింగిల్ విండో పేరిట జగిత్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 2020, జూలై 6న డాక్యుమెంట్ నెంబర్ 4052/20, ద్వారా రిజిస్టర్ అయ్యింది. అయితే 10 రోజుల తర్వాత  పట్టేదారతో ధర్మపురి సింగల్ విండోకు 16-07-2020 న  నాన్ జుడీషియల్ స్టాంపు పేపర్ పై వ్రాయించుకోవడంలోనే కొత్తకోణంకు పాలకవర్గం శ్రీకారం చుట్టింది.

👉 0-13 గుంటల భూమి పట్టా దారు పేరున ఉంది !


సొసైటీ పేరిట రిజిస్ట్రేషన్ తరువాత 2021, ఫిబ్రవరి, 20 న ధర్మపురి తహసిల్దార్ & జాయింట్ సబ్ రిజిస్టార్ కార్యాలయం లో భూమి మోటేషన్ జరిగింది.

రెవెన్యూ రికార్డులలో నమోదైన వివరాలు !


పట్టేదారు రాజేశ్వర్ రెడ్డి,  పాస్ పుస్తకం నెంబర్ T 18030120113, డాక్యుమెంట్, 4052/2020.  ఖాతా నెంబర్ 283, లో  లావాదేవీల తరువాత విక్రేత కు, సర్వే నెంబర్లు, 174ఆ/2 లో, 81 ఇ, 83 ఈ, లో భూమి ఉన్నట్టు నమోదు అయి ఉంది. ధర్మపురి సొసైటీ పేరిట రిజిస్ట్రేషన్ అయిన 0-27 గుంటల భూమికి పట్టేదారు పాస్ పుస్తకం నంబర్ T18030120460, ఉన్నట్టు రెవెన్యూ రికార్డులలో నమోదు అయ్యింది.

☝️ ధర్మపురి తహసిల్దార్ & జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయం లో రెవెన్యూ రికార్డులో పట్టేదారు పేరిట ఉన్నభూమి వివరాలు !

👉 ధర్మపురి విండో ఐదు సంవత్సరాల పాలకవర్గ పదవీకాలం ఈ సంవత్సరం ఫిబ్రవరి 15 కు ముగిసే నేపథ్యంలో ప్రభుత్వం వీరి పదవి కాలం ఆగస్టు 15  వరకు ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా పొడిగించింది. తిరిగి ఈనెల 14న ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య, 386 ద్వారా  మరో ఆరు నెలల పాటు పదవీకాలం పొడిగిస్తూ  ఉత్తర్వులు జారీ చేసింది.

👉 అక్రమాలకు అధికారుల అండదండలు ?

సొసైటీకి రిజిస్ట్రేషన్ కావలసిన 0-13 గుంటల భూమి గత ఐదు సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్ ఉలుకు పలుకు లేదు, సంబంధిత జిల్లా శాఖ అధికారులు అట్టి భూమిని సొసైటీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించకపోవడంతో సొసైటీ అక్రమా కార్యకలాపాలకు  జిల్లా సహకార సంఘ శాఖ అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని ఆరోపణలకు బలం చేకూర్చున్నది. 

అమాయక రైతులకు చెందిన లక్షలాది రూపాయల నిధులతో ఎకరం భూమి కొనుగోలు చేసినట్టు రికార్డులలో నమోదు చేసి  కేవలం 0-27 గుంటలు రిజిస్ట్రేషన్ జరిగిన, మరో 0- 13 గుంటల భూమి అధికార యంత్రాంగం ఏ కారణంతో, ఎలాంటి ప్రలోభవాలకు  లొంగి మౌనం వహిస్తున్నారో ? అనే అంశంపై  అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు విచారణ జరిపి 0-13 గుంటల భూమి సొసైటీ పేరున రిజిస్ట్రేషన్ చేయించాలని రైతాంగం డిమాండ్ చేస్తున్నారు.